విజయసాయి చెప్పినట్లు ముందుగా స్పీకర్ తమ్మినేని చేయాలన్న రఘురామ..!

రఘురామకృష్ణరాజుపై అనర్హతా వేటే లక్ష్యంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర న్యాయమంత్రి కిరణ్ రిజుజుకు లేఖ రాశారు. లేఖలో ఎక్కడా రఘురామ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ అన్హతా పిటిషన్‌ను మూడు నెల్లలో పరిష్కరించేలా రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో మార్పులు చేయాలన్నారు. దీనిపై ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖ రాశారు. ఇతర పార్టీల నుంచి గెలిచి వైసీపీలో చేరిన వారిపై చర్యలు తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాశారు.

వైసీపీ ఎంపీలు కిరణ్ రిజుజును ఇలా కోరారని.. మీ దగ్గర అనర్హతా పిటిషన్లుపెండింగ్‌లో ఉంటే వాటిని పరిష్కరించాలని రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరి, వాసుపల్లి గణేష్ వైసీపీకి మద్దతు పలికారు. వీరెవరూ లాంఛనంగా కండువా మాత్రం కప్పించుకోలేదు. కానీ ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇక జనసేన పార్టీ తరపున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీలో అనధికారికంగా చేరారు. ఆయనకూ అధికారికంగాకండువా కప్పుకోలేదు. కానీ వీరంతా వైసీపీ కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారు.

తాము ఏ పార్టీ తరపున గెలిచామో ఆ పార్టీని.. ఆ పార్టీ నేతల్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయినప్పటికీ.. వారు వైసీపీలో చేరలేదన్న కారణంగా స్పీకర్ తమ్మినేని సీతారం వారిపై అనర్హతా వేటు వేయకపోగా… ప్రత్యేకంగా సీట్లు కేటాయిస్తున్నారు. వైసీపీ ఎంపీలు కిరణ్ రిజుజుకు రాసిన లేఖను బట్టి… వైసీపీ కోరుకున్నట్లుగా ముందుగా ఏపీలో అమలు చేయాలని రఘురామరాజు కోరుతున్నారు. రఘురామరాజు వైసీపీని విమర్శిస్తున్నారు కానీ ఏ పార్టీతోనూ సన్నిహితంగా మెలగడం లేదు. కుటుంబసభ్యుల్ని కూడా ఇతర పార్టీల్లో చేర్పించలేదు. వైసీపీ నేతలకు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇవ్వడంలో రఘురామకృష్ణరాజు చురుకుగా వ్యవహరిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఛ‌త్ర‌ప‌తి’కి టైటిల్ కావ‌లెను

తెలుగులో సూప‌ర్ హిట్ట‌యిన `ఛ‌త్ర‌ప‌తి`ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్ట‌బోతున్నాడు. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌కూ ఇదే తొలి హిందీ...

ప్రభుత్వ వేధింపులపై “గొట్టిపాటి” న్యాయపోరాటం .. సుప్రీంలో ఊరట !

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కుటుంబానికి చెందిన కిషోర్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వారీల్లో తనిఖూలు చేసి కిషోర్‌ గ్రానైట్స్‌...

తెలంగాణలో “బియ్యం స్కాం” బద్దలవబోతోందా !?

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఆ ఆంశంపైనే దృష్టి కేంద్రీకరించి బీజేపీని నిలుపుదల చేయాలని చూస్తున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేసీఆర్...

కరోనా బాధిత జర్నలిస్టు కుటుంబాలకు తెలంగాణ సర్కార్ అండ !

జర్నలిస్టుల సంక్షేమంలో మాటలు చెప్పడం కన్నా అంతో ఇంతో ఆచరణలో చూపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. గతంలో కరోనా బారిన పడిన జర్నలిస్టులకు రూ. ఇరవై వేల చొప్పున ఇచ్చిన ప్రభుత్వం.. ...

HOT NEWS

[X] Close
[X] Close