జగన్‌ను ధిక్కరిస్తున్న రఘురామకృష్ణంరాజు..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు… జగన్మోహన్ రెడ్డి మాటలను లెక్కచేయడం లేదా..? మొన్నటి పార్లమెంటరీ పార్టీ భేటీలో జగన్ హెచ్చరించిన ఎంపీల్లో రఘురామకృష్ణంరాజు ఒకరా..? అంటే.. అవుననే సమాధానాన్ని రఘురామకృష్ణంరాజు తొలి రోజు పార్లమెంట్ సమావేశాల్లోనే… ఇన్‌డైరక్ట్‌గా చెప్పే ప్రయత్నం చేశారు. తెలుగు మీడియాన్ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారు. దాన్ని వైసీపీ నేతలందరూ.. పార్టీ లైన్‌గా.. గట్టిగా సమర్థిస్తున్నారు. జగన్ కూడా…పార్టీ లైన్ ప్రకారమే.. మాట్లాడాలని స్పష్టం చేశారు. కానీ రఘురామకృష్ణంరాజు… తొలి రోజు.. తెలుగును కాపాడాలంటూ.. పార్లమెంట్‌లో గళమెత్తారు. మాతృభాషలో విద్యాబోధనకు ప్రాధాన్యతనీయాలని డిమాండ్ చేశారు. మాతృభాషా పరిరక్షణకు ఉద్దేశించిన రాజ్యాంగంలోని 350, 350ఎ అధికరణాల స్ఫూర్తి దెబ్బతినకుండా కేంద్రం గట్టి చర్యలు తీసుకోవాలని రఘురామరాజు కోరారు.

రఘురామకృష్ణంరాజు.. ఎంపీగా ఎన్నికైన తర్వాత … రెండు,మూడు సార్లు ప్రధానమంత్రిని కలిశారు. దానికి పార్టీ పర్మిషన్ తీసుకోలేదు. కేంద్రమంత్రులతో దగ్గరి సంబంధాలు ఏర్పర్చుకున్నారు. వారికి విందులకు ఆహ్వానిస్తున్నారు కూడా. ఈ సంబంధాలు.. అంతకంతకూ పెంచుకుపోతూండటంతో… ఆయనకు.. కొన్ని పదవులు కూడా వచ్చాయి. ఓ విభాగంలో పార్లమెంటరీ స్థాయీ సంఘం పదవి కూడా వచ్చింది. నిజానికి ఆయన పేరును వైసీపీ సిఫార్సు చేయలేదు. విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డిల పేర్లను మాత్రమే.. జగన్ సిఫార్సు చేశారు. వారిద్దరితో పాటు… రఘురామకృష్ణంరాజుకు కూడా పదవి ప్రకటించారు. దీంతో వైసీపీ వర్గాలు ఆశ్చర్యపోయాయి. బీజేపీకి ఆయన బాగా దగ్గరవడం వల్లే ఇలా జరిగిందని వైసీపీ నాయకత్వం ఓ అభిప్రాయానికి వచ్చింది.

అయితే.. బీజేపీకి దగ్గరైనప్పటికీ… జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వారిపై ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితిలో లేరు. దీంతో… వ్యాపార పనులు ఉన్న పనులు ఎంపీలు కూడా.. లాబీయింగ్ కోసం.. కేంద్రమంత్రుల్ని కలుస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ అంశంలో.. రఘురామకృష్ణంరాజుకు ఇంకా ఎక్కువ అవసరం. అందుకే ఆయన.. జగన్మోహన్ రెడ్డి కన్నా.. బీజేపీ విధానాలకే ఎక్కువ కట్టుబడి ఉంటున్నారంటున్నారు. మొత్తానికి.. రఘురామకృష్ణంరాజు.. వైసీపీలో ఓ రకమైన అలజడి మాత్రం రేపుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రైమ్‌ : బెంగళూరులో స్పాలు,క్లబ్‌ల వ్యాపారం “అదే”నా..!?

వారాంతం వస్తే మెట్రో నగరాల్లో సందడి సగమైతాదని అందరూ చెప్పుకుంటారు.. కానీ సందట్లో సడేమియాలో కూడా రెట్టింపు అవుతాయి. ఈ విషయం పోలీసులు రైడింగ్ చేసినప్పుడల్లా తెలిసిపోతుంది. బెంగళూరు పోలీసులు ఖాళీగా ఉన్నామని...

కేసీఆర్ ఫటాఫట్ : రూ. 50వేల రైతుల రుణాలు ఈ నెలలోనే మాఫీ..!

ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేయలేదని వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ ఏడాది రూ. యాభై వేల వరకూ ఉన్న రైతుల రుణాలను చెల్లించాలని...

ఒలింపిక్స్ : సింధుకు కాంస్య పతకం..!

టోక్యో ఒలింపిక్స్‌లో  పీవీ సింధు రజతం గెల్చుకున్నారు. రజతం కోసం జరిగిన పోరులో చైనా షట్లర్ హీ బింగ్జియాని రెండు వరుస సెట్లలో మట్టి కరిపించిన సింధు.. రజతం కైవసం చేసుకున్నారు. సెమీస్‌లో...

జాబ్ క్యాలెండ్‌లో మార్పులకు జగన్ రెడీ..!?

జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగుల ఆందోళనలు అంతకంతకూ పెరిగిపోతూండటంతో ఏపీ సర్కార్ పునరాలోచనలో పడినట్లుగా కనిపిస్తోంది. నాలుగు, ఐదు తేదీలలో అన్ని నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు భారీ ఎత్తున నిరసనల ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి....

HOT NEWS

[X] Close
[X] Close