చైతన్య : మాతృభాషలో చదువు అక్కర్లేదన్న ఒకే ఒక్కడు..! ప్రపంచంలోనే..!

ప్రపంచదేశాలను ఇప్పటికి ఎందరో పాలించారు. దేశాల్లోని రాష్ట్రాలను పాలించారు. వారిలో నియంతలున్నారు. ప్రజాస్వామ్య ప్రేమికులున్నారు. విప్లవాల నుంచి పుట్టుకొచ్చిన ఏకస్వామ్య పాలకులున్నారు. ఎవరూ కూడా.. తమ మాతృభాషలో చదువు వద్దని చెప్పలేదు. చెప్పిన దాఖలాలు లేవు. కనీసం అలాంటి ఆలోచన కూడా.. ఎవరూ చేసి ఉండరు. కానీ మొదటి సారిగా.. ఆ రికార్డును… ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాధించారు. ఆయన ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని సాధించారు. మాతృభాష వద్దు.. ఇంగ్లిష్ ముద్దు అని.. తేల్చిన మొదటి రాజకీయ నాయకుడయ్యారు.

మాతృభాషలో చదువు వేస్ట్ అన్న తొలి పాలకుడు..!

దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే తొలి సారిగా.. ఓ ప్రాంతీయ భాషపై.. ఆ భాషను రక్షించాల్సిన వాళ్లే.. కత్తి కట్టారు. తెలుగు మీడియం అవసరం లేదని తేల్చేశారు. దానికి పేదలకు ఇంగ్లిష్ చదువులొద్దా.. అనే సెంటిమెంట్ జోడిస్తున్నారు. పేదలకు ఇంగ్లిష్ చదువులు చెప్పించాలంటే…తెలుగును చంపాలని ప్రభుత్వ పెద్దకు ఎవరు సలహా ఇచ్చారో కానీ.. ఆయన ఆవేశ పడిపోతున్నారు. పేదలను తాను ఉద్దరిస్తూంటే. ఇతరులు అడ్డుకుంటున్నారంటున్నారు. భారత్‌లో… ప్రాంతీయభాషలు సంస్కృతి , సంప్రదాయాలకు ప్రతీకలు. ఎక్కడికి వెళ్లిన తెలుగు సంప్రదాయం, తమిళ సంస్కృతి అంటూ చెబుతూంటారు అంటేనే.. భాషలో ఇమిడి ఉన్న ప్రత్యేకమైన గుర్తింపును అర్థం చేసుకోవచ్చు. అందుకే.. రాజకీయాలకు అతీతంగా.. ఆయా రాష్ట్రాలు.. భాషను.. కన్నతల్లితో సమానంగా చూస్తూంటాయి. ఇంగ్లిష్ మోజులో తమ ఉనికి..కొట్టుకుపోకుండా.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అవేమీ..ఆయా రాష్ట్రాల యువత ఎదుగుదలకు అడ్డంకులు కావడం లేదు.

తెలుగు సంస్కృతి, సంప్రదాయాల్నీ ట్రాష్..!

భారత దేశానికి ఉన్న ప్రత్యేకత.. భిన్నత్వంలో ఏకత్వం. అందులో భాష కూడా ఒకటి. భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసేటతంటి భాషా వైవిధ్యం భారత్‌లో ఉంది. కానీ ఈ భాష ఎప్పుడూ.. ఏ విషయంలోనూ అడ్డంకి కాలేదు. దేశంలో..ఉత్తరాది మొత్తం దాదాపుగా హిందీ మీడియం ఉంటుంది. దక్షిణాదిలో… తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలు ఉంటాయి. అయినా దక్షిణాదినే .. ఉత్తరాది కన్నా వేగంగా అభివృద్ధి సాధిస్తోంది. తయారీ, సేవా రంగాల్లో.. భారత్ అంటే దక్షిణాదినే. స్థానిక భాషల్లో చదువుకుని.. ఇంగ్లిష్ పై పట్టు సాధించేవారు ఇక్కడే ఎక్కువ ఉంటారు. అందుకే మానవ వనరుల్లోనూ.. దక్షిణాదినే అగ్రస్థానంలో ఉంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పరిశీలన చేస్తే… ప్రాంతీయ భాషలు.. ప్రజల .. ఆర్థిక స్థితిగతుల ఎదుగుదలకు ఎలాంటి అడ్డంకి సులువుగానే అర్థం చేసుకోవచ్చు.

ఇంగ్లిష్ చదువుకున్నవారందరికీ మంచి భవిష్యత్ గ్యారంటీ ఉందా..?

పేదవారికి ఇంగ్లిష్ చదువు చెప్పించాలనుకోవడం అందరూ స్వాగతిస్తున్నారు. ఆ పేరుతో తెలుగును ఎందుకు చంపేస్తున్నారన్నదేచాలా మందికి అర్థం కావడం లేదు. తెలుగు మీడియంలో చదివితే.. ఇంగ్లిష్ భాష రాదన్నట్లుగా.. ఇంగ్లిష్ మీడియంలోనే చదివితేనే ఉద్యోగాలొస్తాయన్నట్లుగా సీఎం.. సభల్లో చెబుతున్నారు. కానీ ఇంగ్లిష్ మీడియంలో చదివి నిరుద్యోగులుగా ఉన్న వారు ఇప్పటికే ఊరుకి పది మంది చొప్పున ఉంటారు. వారందరూ ఎందుకు నిరుద్యోగులుగా ఉన్నారో.. ప్రభుత్వమే విశ్లేషణ చేసి చెప్పాల్సి ఉంది. కానీ అవన్నీ ఆలోచించే పరిస్థితి లేదు. ప్రజలు కూడా.. మాతృభాషకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించలేకపోతున్నారు. ఎలా చూసినా.. జగన్మోహన్ రెడ్డి.. మాతృభాషకు పాడె కట్టేస్తున్న తొలి పాలకుడిగా… చరిత్రలో నిలిచిపోతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close