పాకిస్తాన్‌లో ఆ విశాఖ కుర్రాడు “సాహసం” చేస్తున్నాడా..?

సాహసం అనే సినిమాలో గోపీచంద్… తాత ముత్తాతల నిధి.. పాకిస్థాన్‌లో ఉందని.. దాన్ని తీసుకోవడానికి సాహసయాత్ర చేస్తారు. నేరుగా పాకిస్తాన్‌లోకి వెళ్తాడు. ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ ఒకటి.. పాకిస్థాన్‌లో పట్టుబడినట్లుగా తెలుస్తోంది. విశాఖపట్నానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడు… హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ.. రెండేళ్ల కిందట.. కనిపించకుండా పోయాడు. హఠాత్తుగా.. ఆ యువకుడ్ని పాకిస్థాన్ పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. కోర్టు బయట… తెలుగులో మాట్లాడాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రశాంత్‌తో పాటు మధ్యప్రదేశ్‌కు చెందిన మరో వ్యక్తిని కూడా పాకిస్థాన్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాస్‌పోర్టు, వీసా లేకుండా కొలిస్తాన్‌ ఎడారిలో ప్రవేశించడంతో.. పట్టుకున్నట్లుగా అక్కడి పోలీసులు చెబుతున్నారు.

భారత్‌ను ఎవరు పాకిస్థాన్‌లో పట్టుబడినా.. వారిపై కచ్చితంగా… టెర్రరిస్ట్ అనే ముద్ర వేస్తారు. పాకిస్థాన్‌లో ఏదో విధ్వంసం సృష్టించడానికి వచ్చాడని అనుకుంటారు. ఆ కోణంలోనే విచారణ జరుపుతారు. ప్రస్తుతానికి ప్రశాంత్ విషయంలో… పాకిస్తాన్ పోలీసులు కూడా అదే చెబుతున్నారు. కానీ.. అలాంటి ఆధారాలేమీ మాత్రం దొరకలేదు. అలాంటి ఆధారాలు దొరికి ఉంటే మాత్రం.. అసలు పట్టుకున్నట్లుగా కూడా చూపించేవారు కాదు. దాంతో.. ఇప్పుడు ప్రశాంత్.. అసలు… పాకిస్తాన్ ఎందుకు వెళ్లాడన్నది ఆసక్తికరంగా మారింది.

ఉన్నత విద్యావంతుడైన ప్రశాంత్… హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ ఉండేవారు. “లైక్ మైండెడ్” పీపుల్‌తో.. సోషల్ మీడియాలో సంబంధాలు ఏర్పడటంతో.. తన లక్ష్యం కోసం.. పాకిస్థాన్ వైపు వెళ్లాడని అంటున్నారు. టెర్రరిజం మాత్రం కాదని… సాహసం సినిమాలో… నిధుల కోసం.. సాగించిన అన్వేషణ తరహాలో… ప్రయత్నాలు చేసినట్లుగా అనుమానిస్తున్నారు. ప్రశాంత్‌ను విడిపించడానికి చర్యలు తీసుకోవాలని… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశాంత్‌ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com