జగన్‌కు తెలిసే అంతా జరుగుతోంది : రఘురామకృష్ణంరాజు

రఘురామకృష్ణంరాజుపై అనర్హతా వేటు వేయించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఎప్పుడూ ఢిల్లీ వ్యవహారాలను పట్టించుకునే విజయసాయిరెడ్డి ఈ సారి దూరంగా ఉన్నా.. ఎంపీ బాలశౌరి లీడ్ తీసుకుని.. తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఓ సారి స్పీకర్ ఓంబిర్లాను కలిసిన ఆయన.. ఈ సారి.. మొత్తం వైసీపీ ఎంపీలను తీసుకుని వెళ్లి.. మరోసారి రఘురామకృష్ణంరాజుపై ఫిర్యాదు చేయనున్నారు. ఆయన పార్టీ కట్టుబాట్లను దాటిపోయారని.. ఆయనపై అనర్హతా వేటు వేయాలని పిటిషన్ సమర్పించనున్నారు. ప్రత్యేక విమానంలో వీరంతా శుక్రవారం.. ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.

అయితే.. వైసీపీ ప్రయత్నాలపై రఘురామకృష్ణంరాజు భిన్నంగా స్పందించారు. ఇప్పటి వరకూ జరుగుతున్న పరిణామాలన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరుగుతున్నాయనుకున్నానని.. కానీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్న విషయం ఇప్పుడు స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. తనపై అనర్హతా వేటు కోసం ప్రయత్నిస్తున్న ఎంపీ బాలశౌరి భవిష్యత్ ఎలా ఉంటుందోనని చెప్పుకొచ్చారు. ప్రత్యేక విమానంలో.. ఢిల్లీకి రావడం.. ప్రజాధనం వృధా కావడం మినహా ఇంకేమీ జరగబోదన్నారు. తాను పార్టీకి.. పార్టీ అధినేతకు వ్యతిరేకంగా మాట్లాడలేదని మరో సారి స్పష్టం చేశారు. ప్రజాసమస్యను ప్రస్తావించారని.. అనర్హతా వేటు వేస్తే.. పార్లమెంట్‌లో ఎవరూ ఉండరని చెప్పుకొచ్చారు. వెంకన్న భూములను అమ్మవద్దని అన్నందుకే తనపై వేటు వేసే ప్రయత్నం చేస్తున్నారని.. తాను వెంకన్న దయతో అగ్నిపునీతుడవుతానని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా వైసీపీ ఎంపీలు తనపై అనర్హతా వేటు వేసే విషయంపై ప్రయత్నాలను.. మానుకోవాలని హితవు పలికారు.

మరో వైపు.. రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంతో పరిచయాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన కేంద్రమంత్రులతో పలుమార్లు భేటీ అయ్యారు. ప్రధానమంత్రి మోడీ పరాక్రమాన్ని ప్రశంసిస్తూ.. రెండు వీడియోలు విడుదల చేశారు. పాటలు కూడా రిలీజ్ చేశారు. తాజాగా.. మోడీ.. నవంబర్ వరకూ పేదలకు రేషన్ ఉచితంగా ఇవ్వాలన్న నిర్ణయాన్ని ప్రశంసిస్తూ లేఖ రాశారు. అదే సమయంలో.. అమరావతి ఉద్యమంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అమరావతి ఉద్యమం ప్రారంభమయి రెండు వందల రోజులు అయిన సందర్భంగా.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారికి మద్దతు తెలియచేయాలని రఘురామకృష్ణంరాజు నిర్ణయించుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌రోనాని జ‌యించిన జ‌క్క‌న్న కుటుంబం

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్.రాజ‌మౌళి, అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. రెండు వారాల నుంచి రాజ‌మౌళి, కుటుంబ స‌భ్యులు హోం క్వారెంటైన్‌లోనే ఉంటున్నారు. డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈరోజు...

ప్చ్…ఇళ్ల పట్టాల పంపిణీ మళ్లీ వాయిదా..!

ఆగస్టు పదిహేనో తేదీన 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలిస్తామన్న ఏపీ సర్కార్ మళ్లీ వాయిదా బాట పట్టింది. కోర్టుల్లో కేసులున్నాయంటూ... మరోసారి ముహుర్తం మార్చింది. ఈ సారి గాంధీ జయంతికి...

అనధికార కేబినెట్ భేటీని నిర్వహించేసిన కేటీఆర్..!

తెలంగాణ సర్కార్‌లో నెంబర్ టూగా ఉంటూ.. సీఎం రేంజ్ పవర్స్ తో పాటు విధులు కూడా నిర్వహిస్తున్న అనధికారికంగా కేబినెట్ భేటీ కూడా నిర్వహించేశారు. ప్రాక్టీస్ కోసం అన్నట్లుగా జరిగిన ఈ కేబినెట్...
video

స‌డ‌క్ 2 పై.. సుశాంత్ అభిమానుల సెగ‌

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య వెనుక‌.. ప్ర‌త్య‌క్షంగానూ ప‌రోక్షంగానూ మ‌హేష్ భ‌ట్ ప్ర‌మేయం ఉంద‌ని సుశాంత్ అభిమానులు న‌మ్ముతున్నారు. చాలా రోజులుగా సుశాంత్ వ‌ర్గం మ‌హేష్ భ‌ట్ ని టార్గెట్ చేస్తోంది....

HOT NEWS

[X] Close
[X] Close