హైకోర్టు అధికారాలనే ప్రశ్నిస్తున్న స్పీకర్ తమ్మినేని..!

రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న తమ్మినేని సీతారాం.. తెలుగుదేశం పార్టీతో పాటు.. ఇతరులపై చేస్తున్నట్లుగానే న్యాయవ్యవస్థపైనా వ్యాఖ్యలు చేస్తున్నారు. కోర్టులో పరిపాలిస్తున్నాయని.. ఇక సీఎం.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు ఎందుకంటూ.. వ్యవస్థనే ప్రశ్నించేలా.. తిరుపతిలో మాట్లాడారు. ద్రవ్య వినిమయ బిల్లును టీడీపీ నేతలు అడ్డుకున్నారని కూడా.. శాసనమండలి అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై రాజకీయ దుమారం ప్రారంభమైంది. కోర్టులపై తమ్మినేని సీతారం చేసిన వ్యాఖ్యలపై.. ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ స్పందించారు. చట్టాలు చేయడం శాసన వ్యవస్థ విధి అని.. అవి రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేవా అన్నది చూడాల్సిన పని న్యాయవ్యవస్థదని స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధంగా లేకపోతే.. కోర్టుల నిర్ణయమే ఫైనల్ అవుతుంతుందని స్పష్టం చేశారు.

ఏపీ ప్రభుత్వం ఇటీవలి కాలంలో తీసుకుంటున్న ఎన్నో నిర్ణయాలు రాజ్యాంగ.. చట్ట వ్యతిరేకంగా ఉన్నాయని కోర్టులు కొట్టి వేశాయి. సుప్రీంకోర్టులోనూ ఊరట దక్కడం లేదు. అయితే.. ఈ అక్కసుతో వైసీపీ నేతలు కోర్టులపైనా వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో…వైసీపీ నేతలు కోర్టులపై వ్యాఖ్యలు చేయడం తగ్గిపోయింది. కానీ స్పీకర్ పదవిలో ఉన్న తమ్మినేనికి ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి. ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటారు. అందుకే.. ఎలాంటి వ్యాఖ్యలు చేసిన చెల్లిపోతుదంన్న ఉద్దేశంతో.. ఆయనను వైసీపీ ముందు పెడుతోందన్న ప్రచారం జరుగుతోంది. వ్యాయవ్యవస్థను సైతం వైసీపీ బ్లాక్‌మెయిల్ చేస్తోందని.. ఇటీవలి కాలంలో విపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.

మరో వైపు శాసనమండలిలో టీడీపీనే ద్రవ్య వినిమయ బిల్లు అడ్డుకుందంటూ.. ఆయన చేసిన ఆరోపణలను టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఖండించారు. మండలిలో టీడీపీ సభ్యులు 30 సార్లు ద్రవ్య వినిమయ బిల్లు పెట్టాలని కోరారని.. ఆ విషయం రికార్డుల్లో ఉంటుందన్నారు. స్పీకర్ స్థానంలో ఉండి అబద్దాలు చెప్పడం .. సరి కాదన్నారు. మొత్తానికి తమ్మినేని సీతారం.. స్పీకర్ స్థానంలో ఉండి.. చంద్రబాబుపై.. సోనియాపై .. టీడీపీపై ఇష్టం వచ్చినట్లుగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంలోనే కాదు.. న్యాయవ్యవస్థపైనా అదే తరహా వ్యాఖ్యలు చేస్తూ కొత్త వివాదం సృష్టిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌రోనాని జ‌యించిన జ‌క్క‌న్న కుటుంబం

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్.రాజ‌మౌళి, అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. రెండు వారాల నుంచి రాజ‌మౌళి, కుటుంబ స‌భ్యులు హోం క్వారెంటైన్‌లోనే ఉంటున్నారు. డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈరోజు...

ప్చ్…ఇళ్ల పట్టాల పంపిణీ మళ్లీ వాయిదా..!

ఆగస్టు పదిహేనో తేదీన 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలిస్తామన్న ఏపీ సర్కార్ మళ్లీ వాయిదా బాట పట్టింది. కోర్టుల్లో కేసులున్నాయంటూ... మరోసారి ముహుర్తం మార్చింది. ఈ సారి గాంధీ జయంతికి...

అనధికార కేబినెట్ భేటీని నిర్వహించేసిన కేటీఆర్..!

తెలంగాణ సర్కార్‌లో నెంబర్ టూగా ఉంటూ.. సీఎం రేంజ్ పవర్స్ తో పాటు విధులు కూడా నిర్వహిస్తున్న అనధికారికంగా కేబినెట్ భేటీ కూడా నిర్వహించేశారు. ప్రాక్టీస్ కోసం అన్నట్లుగా జరిగిన ఈ కేబినెట్...
video

స‌డ‌క్ 2 పై.. సుశాంత్ అభిమానుల సెగ‌

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య వెనుక‌.. ప్ర‌త్య‌క్షంగానూ ప‌రోక్షంగానూ మ‌హేష్ భ‌ట్ ప్ర‌మేయం ఉంద‌ని సుశాంత్ అభిమానులు న‌మ్ముతున్నారు. చాలా రోజులుగా సుశాంత్ వ‌ర్గం మ‌హేష్ భ‌ట్ ని టార్గెట్ చేస్తోంది....

HOT NEWS

[X] Close
[X] Close