పార్టీ వేరు.. ప్రభుత్వం వేరంటున్న ఆర్ఆర్ఆర్..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో విందు భేటీ నిర్వహించారు. ఆయన రాజకీయం కొద్ది రోజులుగా బీజేపీ చుట్టూనే తిరుగుతోంది. మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా.. పొగుడుతూ ఉత్తరాలు రాస్తున్నారు. పేపర్లలో ఆర్టికల్స్ రాస్తున్నారు. ఈ క్రమంలో ఆయన రాజ్‌నాథ్‌తో భేటీ మరింత ఆసక్తి కరంగా మారింది. అయితే.. రాజకీయ ప్రాథాన్యత లేదని.. తాను ఓ పార్లమెంటరీ కమిటీకి చైర్మన్‌గా ఉన్నందున ఆ పని మీద కలిసినట్లుగా చెప్పుకొచ్చారు. కానీ రఘురామకృష్ణరాజు.. బీజేపీ నేతలతో పరిచయాలు పెంచుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. తనపై వైసీపీ వేసిన అనర్హతా పిటిషన్.. తన పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ పదవిని ఊడబీకేందుకు ప్రయత్నాలు చేస్తూండటం.. వంటి వాంటితో.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పెద్దల అండ చాలా ముఖ్యమని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అందుకే.. రఘురామకృష్ణంరాజు తరచూ బీజేపీ పెద్దల్ని కలిసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అదే సమయంలో.. తాను పార్టీపై ఎలాంటి విమర్శలు చేయలేదని చెప్పడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. పార్టీ వేరు.. ప్రభుత్వం వేరని.. ప్రభుత్వానికి మాత్రం సూచనలు చేస్తున్నానని లాజిక్ వినిపిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం భూములు, ఇసుక సమస్య వంటి వాటిపై ప్రభుత్వానికే సూచనలు ఇచ్చానని చెప్పుకొచ్చారు. అదీ కూడా.. తాను మొదటగా మాట్లాడలేదన్నారు. ఇసుక కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ పెడుతున్నారూ అంటే.. అందులో తప్పు జరుగుతున్నట్లే కదా.. అని లాజిక్ తీసుకొచ్చారు. ఇప్పటికీ ఆయన పార్టీ గురించి సానుకూలంగా మాట్లాడుతున్నారు పార్టీ చాలా క్రమశిక్షణగా, పటిష్టంగా ఉందని తానెప్పుడు పార్టీని విమర్శించలేదన్నారు.

మీడియానే మా సంసారంలో నిప్పులు వేయాలని చూస్తోందని, అలాంటి పనులు మానుకోవాలని సూచించారు. వైసీపీ మరో 20 ఏళ్లు అధికారంలో ఉండాలన్న అభిప్రాయంతో ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశానని రఘురామ స్పష్టంచేశారు. పార్టీకి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే.. ఆ ఆప్షన్ ను ఉపయోగించుకుందామని.. వైసీపీ చూస్తోంది కానీ.. ఎక్కడా రఘురామకృష్ణంరాజు చాన్సివ్వడం లేదు. పైగా.. ప్రభుత్వానికి .. వరుసగా లేఖలు రాస్తూ.. చికాకు తెప్పిస్తున్నారు. రఘురామకృష్ణరాజును ఎలా డీల్ చేయాలో తెలియక.. వైసీపీ నేతలు తంటాలు పడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రఘురామకృష్ణరాజుకు వై కేటగిరీ సెక్యూరిటీ..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు కేంద్ర బలగాలు రక్షణ కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనకు వై కేటగిరి సెక్యూరిటీ కల్పించినట్లుగా సమాచారం అందిందని.. అధికారిక ఆదేశాలు ఒకటి రెండు రోజుల్లో వస్తాయని రఘురామకృష్ణరాజు మీడియాకు...

దళిత నేతలతోనే న్యాయస్థానాలపై వివాదాస్పద వ్యాఖ్యలు..! వైసీపీ స్ట్రాటజీ ఏంటి..?

వైసీపీ రాజకీయ వ్యూహం.. న్యాయవ్యవస్థపై సామాజిక పద్దతుల్లో అమలు చేస్తున్నారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా.. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని... దళితుల్ని అడ్డు పెట్టుకుని.. న్యాయవ్యవస్థపై విమర్శలు చేసి.. ఒత్తిడి పెంచే...

రామాలయ భూమిపూజ లైవ్ ఇవ్వని ఎస్వీబీసీ..! బీజేపీ విమర్శలు..!

అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ చూసేలా.. ఏర్పాట్లు చేశారు. చివరికి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లోనూ... ప్రసారం చేశారు. అయితే.. అనూహ్యంగా... తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి...

భార‌తీరాజా సీక్వెల్‌లో.. కీర్తి సురేష్‌?

భార‌తీరాజా ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `ఎర్ర‌గులాబీలు` సూప‌ర్ హిట్ అయ్యింది. ఇళ‌య‌రాజా సంగీతం, శ్రీ‌దేవి గ్లామ‌ర్‌, క‌మ‌ల్ న‌ట‌న‌.. ఇవ‌న్నీ ఈ చిత్రాన్ని ప్ర‌త్యేకంగా నిల‌బెట్టాయి. ఈ సినిమా వ‌చ్చి దాదాపు 40...

HOT NEWS

[X] Close
[X] Close