“ఉస్మానియా” పాపం ప్రతిపక్షాలదేనా..?

ఉస్మానియా ఆస్పత్రి ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు కేంద్రంగా మారింది. బుధవారం పడిన వర్షానికి ఉస్మానియా మొత్తం నీళ్లు నిండిపోవడం.. చికిత్స గదుల్లో కూడా నీరు చేరడంతో.. విపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. ఐదేళ్ల క్రితం.. అంటే 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఆస్పత్రిని పరిశీలించి… రెండు, మూడేళ్లలో కూలిపోయే పరిస్థితిలో ఉందని.. తక్షణం కూలగొట్టి.. కొత్త నిర్మాణం చేస్తామని ప్రకటించారు. దానికి సంబంధించిన వీడియోలను బయట పెట్టిన విపక్ష పార్టీలు…, ఇప్పుడు.. హుటాహుటిన కూలగొడుతున్న సచివాలయం విషయాన్ని లింక్ పెట్టి విమర్శలు గుప్పిస్తున్నాయి. ఐదేళ్లలో .. ఉస్మానియాను కట్టి తీరుతామని కట్టలేదు కానీ…మూడు నెలల్లో గడీని కట్టుకున్నారని.. కొత్త సచివాలయం కడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.

కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ముఖ్య నేతలంతా ఉస్మానియాను సందర్శించారు. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల ప్రాణాలను బలి పెడుతున్నారని మండిపడ్డారు. అయితే.. విపక్షాల విమర్శలకు.. అధికార పార్టీ నుంచి అనూహ్యమైన కౌంటర్ వచ్చింది. ఉస్మానియా ఆస్పత్రిని కొత్తగా కట్టకుండా ఆపింది విపక్షాలేనని.. టీఆర్ఎస్ ఎదురుదాడి ప్రారంభించింది. అసలు విషయం ఏమింటే.. ఉస్మానియా ఆస్పత్రి హెరిటేజ్ భవనం అని దానిని కూలగొట్టవద్దని.. సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నప్పుడే కోర్టులకు వెళ్లాయి. అదే విషయాన్ని ఇప్పుడు టీఆర్ఎస్ హైలెట్ చేస్తోంది. విపక్షాల వల్లే ఉస్మానియా ఆస్పత్రికి ఈ దుస్థితి వచ్చిందని.. చెప్పడం ప్రారంభించారు. విపక్ష నేతలు ఉస్మానియాను సందర్శించడం పూర్తయిన తర్వాత మంత్రి తలసాని కూడా వెళ్లారు.

పేదల కోసం 27ఎకరాల్లో ఉస్మానియాను పునర్మిస్తామంటే ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లాయని తప్పుబట్టారు. హెరిటేజ్ భవనం అయితే ఉస్మానియాను బాగుచేయకూడదా? అని ప్రశ్నించారు. ప్రఆసుపత్రిలోకి నీళ్లు వచ్చినంత మాత్రానా హంగామా చేస్తారా అంటూ.. ఉస్మానియాలో పరిస్థితిని తేలికగా తీసుకున్నారు. అయితే.. విపక్ష పార్టీలు మాత్రం.. ప్రగతి భవన్‌ను ఎలా నిర్మించారని.. ప్రస్తుతం.. సచివాలయాన్ని ఎలా కూలగొడుతున్నారనిప్రశ్నిస్తున్నారు. వాటిపై కూడా చాలా మంది కోర్టుకు వెళ్లినా.. అన్నింటినీ అధిగమించి కట్టుకుంటున్నారని.. ఉస్మానియా విషయంలో మాత్రం ఎందుకు న్యాయపోరాటం చేయలేదని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి.. ప్రస్తుతం ఉస్మానియా దుస్థితికి కారణం మీరంటే.. మీరని.. అధికార ప్రతిపక్ష పార్టీలు వాదించుకుంటున్నాయి. కానీ రోగులు మాత్రం వారి అవస్థలు వారు పడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close