సంతోష్ కుమార్ చాలెంజ్ అంటే స్వీకరించాల్సిందే..!

కొద్ది రోజులుగా మీడియాలో.. సోషల్ మీడియాలో ఓ వార్త రెగ్యులర్‌గా కనిపిస్తోంది. అదే.. ప్రభాస్.. బ్రహ్మానందం.. సమంత లాంటి స్టార్లు.. మొక్కలు నాటుతూ.. చాలెంజ్‌ను కంప్లీట్ చేయడం.. ఆ చాలెంజ్‌ను మరికొంత మందికి విసరడం. మామూలుగా అయితే… లాక్‌డౌన్ టైంలో .. కరోనా కారణంగా పనులేమీ లేవు కాబట్టి ఖాళీగా ఉన్నారు కాబట్టి.. ఈ చాలెంజ్‌లు చేసుకుంటున్నారని అనుకోవడానికి లేదు. ప్రతి సెలబ్రిటీ మొక్కలు నాటిన తర్వాత ప్రత్యేకంగా గుర్తుంచుకుని మరీ చెబుతున్న పేరు ఒకటి ఉంది.. అదే జోగినిపల్లి సంతోశ్ కుమార్. ఆయన రాజ్యసభ సభ్యుడు. ఈ పదవి కన్నా.. ఆయన .. కేసీఆర్‌ మేనల్లుడుగానే అందరికీ తెలుసు. ప్రస్తుతం కేసీఆర్ కు రైట్ హ్యాండ్‌గా ఉంటూ అన్నీ చక్క బెడుతున్నారు.

కొద్ది రోజుల కిందట.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో.. మొక్కలు నాటాలనే చాలెంజ్‌ను ప్రారంభించారు. కీసర దగ్గర అటవీ ప్రాంతాన్ని.. దత్తత తీసుకున్నారు. ఇతర సెలబ్రిటీలకు చాలెంజ్ చేయడం ప్రారంభించారు. ఇప్పటికి రెండు విడతలు పూర్తయ్యాయి. ప్రస్తుతం మూడో సీజన్ నడుస్తోంది. మొన్న శర్వానంత తన ఇంటి పక్కన చిన్న పార్క్ ను దత్తత తీసుకున్నారు. ఇవాళ.. సమంత మొక్కను నాటి.. రష్మికకు చాలెంజ్ చేశారు. రక్షిక కూడా.. ఇంటి ఆవరణలో మొక్కలు నాటి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ కూడా చేశారు.

హీరోలు అయినా.. సెలబ్రిటీలు అయినా.., హీరోయిన్లు అయినా.. తనకు ఎవరు చాలెంజ్ చేసినప్పటికీ.. మొక్కను నాటిన తర్వాత సంతోష్ కుమార్ పేరును గుర్తు చేసుకోవడం మాత్రం కామన్. ఎంపీ సంతోశ్ సృష్టించిన ఛాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్లాలని అందరూ ఉమ్మడిగా పిలుపునిస్తున్నారు. ప్రస్తుతం జోగినిపల్లి సంతోష్ కుమార్.. పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన ఎలాంటి పనులైనా.. సంతోష్ కుమార్‌నే.. సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ నేరుగా ఎవరూ డైరక్ట్‌గా సంప్రదించలేరు. వయా సంతోష్ కుమారే.. పనులు చక్క బెడుతూ ఉంటారు. దీంతో.. ఆయన మాటలకు అంత కంటే ఎక్కువ విలువ వస్తుందని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం అవసరం  : రామ్మాధవ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని..  దాన్ని భర్తీ చేయాలని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి రామ్‌మాధవ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోము వీర్రాజు.. ఏపీ  బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు...

చిరు మాస్టర్ ప్లాన్

ఆచార్య త‌ర‌వాత‌.. భారీ లైన‌ప్ అట్టి పెట్టుకున్నాడు చిరంజీవి. ఓ వైపు బాబీకి ఓకే చెప్పిన చిరు, మ‌రోవైపు మెహ‌ర్ ర‌మేష్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఇంకోవైపు వినాయ‌క్ తో సినిమా చేయ‌డానికి...

అఖిల్ – సురేంద‌ర్ రెడ్డి ఫిక్స్

`సైరా` త‌ర‌వాత సురేంద‌ర్ రెడ్డి ప్రాజెక్టు ఎవ‌రితో అన్న విష‌యంలో గంద‌ర‌గోళం నెల‌కొంది. అగ్ర హీరోలంతా బిజీ బిజీగా ఉండ‌డంతో.. సురేంద‌ర్ రెడ్డికి అనుకోని విరామం తీసుకోవాల్సివ‌చ్చింది. కొంత‌మంది కోసం క‌థ‌లు సిద్ధం...

సచివాలయం గాయబ్..!

దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్ర పాలనా కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌ హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న భవనాలు నేలమట్టం అయ్యాయి. మొత్తం పదకొండు భవనాలను నామరూపాల్లేకుండా తొలగించేశారు. శరవేగంగా ఇరవై ఐదు...

HOT NEWS

[X] Close
[X] Close