కేంద్ర ప్రభుత్వ “పెట్రో దోపిడి”ని ప్రజల ముందు పెట్టిన రాహుల్..!

దేశంలో ప్రజల ఆదాయం పడిపోతే.. కేంద్రం పెట్రో ధరలను బాదేస్తోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ.. ఇండియాలో మాత్రం రోజుకు అర్థ రూపాయి నుంచిరూపాయి వరకూ పెంచుతూ పోతున్నారు. ఇప్పటి వరకూ గత వారం రోజుల్లో లీటర్‌కు ఆరు రూపాయల వరకూ పెంచారు. దీనిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేంద్రం ప్రజల్ని ఎలా దోపిడి చేస్తుందో వివరిస్తూ.. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. అందులో..గత ప్రభుత్వాలు.. ఈ ప్రభుత్వం.. ఎలా పన్నులు వసూలు చేశాయో వివరించారు. అలాగే అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు అప్పుడు.. ఇప్పుడు ఎలా ఉన్నాయో కూడా వివరించారు.

20014 మేలో యూపీఏ ప్రభుత్వం చివరి రోజులు. ఆ రోజుల్లో… క్రూడాయిల్ బ్యారెల్ ధర దాదాపుగా 108 డాలర్లు ఉంది. కానీ ఆ రోజు ప్రజలకు పెట్రోల్ అమ్మిన రేటు రూ. 71, డీజిల్ రేటు రూ. 55. ఇప్పుడు అంటే.. 2019 జూన్‌లో క్రూడాయిల్ ధర కేవలం 40 డాలర్లు మాత్రమే. అంటే దాదాపుగా అరవై ఏడు డాలర్లు తక్కువ. కానీ ఇప్పుడు ప్రజలకు పెట్రోల్, డీజిల్‌ను కేంద్రం అమ్ముతోంది చాలా ఎక్కువకు. పెట్రోల్ ధర రూ. 76, డీజిల్ ధర 74 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే.. క్రూడాయిల్ ధర అరవై శాతం పెరిగినప్పటికీ.. పెట్రోల్ ధర స్వల్పంగా.. డీజిల్ ధరను భారీగా కేంద్రం పెంచింది.

ఇలా ప్రజల నుంచి పిండుకోవడానికి కేంద్రం… ఎక్సైజ్ డ్యూటీలను అదే పనిగా పెంచుతూ పోయింది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం హయాంలో లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ రూ. 9. 20 పైసలు ఉండేది. మోడీ ప్రభుత్వంలో.. లీటర్ పెట్రోల్ పై వసూలు చేస్తున్న ఎక్సైజ్ పన్ను అక్షరాలా ముప్ఫై మూడు రూపాయలు. అంటే.. మనం లీటర్ పెట్రోల్ కొంటే.. అందులో 33 రూపాయలు కేంద్ర ప్రభుత్వం పన్నుగా తీసుకుంటుంది. మరో ఇరవై రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటాయి. అదే డీజిల్‌పై మన్మోహన్ సర్కార్.. కేవలం మూడున్నర రూపాయలు మాత్రమే ఎక్సైజ్ డ్యూటీ విధించేది.. ఇప్పుడు మోడీ సర్కార్ వసూలు చేస్తోంది అక్షరాలా 32 రూపాయలు. పెట్రో, డీజిల్‌పై బాదుడుతోనే.. కేంద్రం… నాలుగైదు లక్షల కోట్ల పన్నును ఏటా ప్రజల వద్ద పిండేస్తోందని.. ఈ గణాంకాలతో స్పష్టమవుతోంది. ప్రజలకు ఆదాయ మార్గాలు పెంచి.. వారి కొనుగోలు శక్తిని పెంచాల్సిన కేంద్రం… ప్రజల నుంచి పన్నుల రూపంలో పిండుకోవడానికే ప్రాధాన్యం ఇస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close