హైదరాబాద్ ఫుట్ బాల్ లవర్లకు శనివారం బిగ్ డే. స్టార్ మెస్సీ హైదరాబాద్ వస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో హైదరాబాద్ లో ల్యాండ్ అయితే.. రాత్రి ఏడు గంటల సమయంలో రేవంత్ రెడ్డి 9 టీంతో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ మ్యాచ్ లో చివరి పది నిమిషాల్లో ఓ ఆటగాడిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా బరిలోకి దిగుతారు. ఈ మ్యాచ్ చూసేందుకు ప్రతిపక్ష నేత రాహుల్ గాందీ కూడా వస్తున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లి ప్రత్యేకంగా ఆహ్వానించారు రేవంత్ రెడ్డి.
మెస్సీ టూర్ పూర్తిగా ప్రైవేటు కార్యక్రమం. అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. టిక్కెట్లు అన్నీ అమ్మేశారు. సెల్ఫీలు తీసుకోవాలంటే పది లక్షల రూపాయుల చెల్లించాలన్న రూల్ పెట్టారు. ప్రభుత్వం మాత్రం.. కొన్ని భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. వంద కోట్లు ఖర్చు పెడుతున్నారన్న ప్రచారాన్ని ఖండించారు. కేవలం ఏర్పాట్లు మాత్రమే.. బాధ్యతగా చూస్తున్నామని పోలీసులు,ఇతర యంత్రాంగం చెబుతోంది.
శనివారం .. హైదరాబాద్ మొత్తం మెస్సీ మానియా ఉండే అవకాశం ఉంది. ఎయిర్ పోర్టు టు ఫలక్నుమా హోటల్ టు ఉప్పల్ వైపు పూర్తిగా గ్రీన్ చానల్ ఏర్పాటు చేస్తున్నారు. అటు వైపు ఉండేవాళ్లకు ట్రాఫిక్ తిప్పలు తప్పకపోవచ్చు.