ప్రత్యేకహోదాకోసం పోరాడతానన్న రాహుల్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్ట్‌కోసం తాను పోరాడతానని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి అన్నారు. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రత్యేక హోదాను వెనక్కు తీసుకున్నారని ఆరోపించారు. ఆయన ఇవాళ అనంతపురంజిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ ఉదయం బెంగళూరునుంచి కొడికండ చెక్‌పోస్ట్‌కు చేరుకున్న రాహుల్‌కు కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. రఘువీరారెడ్డి, చిరంజీవి, పల్లంరాజు, సుబ్బరామిరెడ్డి, తులసిరెడ్డి, రామచంద్రయ్య, కేవీపీ, జేడీ శీలం, పనబాక లక్ష్మి తదితర నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడనుంచి వారంతా ఓబుళదేవర చెరువుగ్రామం చేరుకున్నారు. రాహుల్ పర్యటనను అడ్డకోవటానికి చంద్రదండు పేరుతో కొందరు తెలుగుదేశం కార్యకర్తలు ప్రయత్నించినప్పటికీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవటంతో అది సాగలేదు. రాహుల్ గోబ్యాక్ అంటూ వారు నినాదాలు ఇచ్చారు.

ఓబుళదేవర చెరువులో గతంలో 1979లో ఇందిరాగాంధి బహిరంగసభ జరిపిన ప్రదేశంలో రాహుల్ ఒక మొక్కను నాటారు. రాజీవ్ గాంధి, వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత అక్కడ జరిగిన బహిరంగసభలో రాహుల్, ఆత్మహత్యచేసుకున్న 45మంది రైతుల కుటుంబాలకు రు.50,000 చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. తర్వాత రైతులు రాహుల్‌కు తమ సమస్యలను ఒక్కొక్కరుగా వివరించారు. కొందరు రాష్ట్రానికి ప్రత్యేకహోదాకోసం రాహుల్ ప్రయత్నించాలని కోరారు. ఆ తర్వాత బహిరంగసభనుద్దేశించి మాట్లాడారు. వైసీపీ, తెలుగుదేశం పార్టీలు ఏపీకి ప్రత్యేక హోదాకోసం, పోలవరం ప్రాజెక్ట్ కోసం ఎందుకు పోరాడటంలేదని ప్రశ్నించారు. కేంద్రాన్ని ప్రశ్నించేందుకు ఈ రెండు పార్టీలూ ఎందుకు భయపడుతున్నాయని అడిగారు. కాంగ్రెస్ పార్టీకి ఏ భయమూ లేదని అన్నారు. ఏపీలోని ఏ గ్రామానికైనా వచ్చి పోరాడతానని చెప్పారు. పారిశ్రామికవేత్తలకు మేలుచేసేందుకే భూసేకరణబిల్లును మోడి ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు. ఆంధ్రాతో ఇందిరాగాంధితో ఉన్న అనుబంధమే తనకూ ఉందని అన్నారు. తర్వాత రాహుల్ పాదయాత్ర ప్రారంభించారు. ఈ సాయంత్రం రాహుల్ పుట్టపర్తి వెళ్ళి సత్యసాయి సమాధిని సందర్శిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అస‌లైన బంగార్రాజు నాన్న‌గారే: నాగార్జున‌

ఈ సంక్రాంతి 'బంగార్రాజు'దే. తొలి మూడు రోజులూ మంచి వ‌సూళ్లు తెచ్చుకుంది. సోమ‌వారం కూడా వ‌సూళ్ల హ‌వా త‌గ్గ‌లేదు. ఈ వ‌సూళ్లు, అంకెలు నాగ్ ని సంతోషంలో ముంచెత్తాయి. ఆ ఆనందం.. రాజ‌మండ్రి...

జ‌గ‌న్ కి థ్యాంక్స్ చెప్పిన నాగ్‌

సినిమా టికెట్ రేట్లు, ఇత‌ర‌త్రా వ్య‌వ‌హారాల‌పై ఇటీవ‌ల చిరంజీవి - జ‌గ‌న్ ల మ‌ధ్య భేటీ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఆ భేటీలో సినిమా ప‌రిశ్ర‌మ‌కు చెందిన‌చాలా విష‌యాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయ‌ని తెలిసింది.కాక‌పోతే.....

విడాకుల సైడ్ ఎఫెక్ట్స్ : ర‌జ‌నీ ఫ్యాన్స్ VS ధ‌నుష్ ఫ్యాన్స్‌

విడాకుల ప్ర‌క‌ట‌న వ‌చ్చి 24 గంట‌లు గ‌డిచిందో లేదో.. అప్పుడే త‌మిళ నాట ర‌జ‌నీ ఫ్యాన్స్, ధ‌నుష్ ఫ్యాన్స్ మ‌ధ్య మాట‌ల యుద్ధం మొద‌లైపోయింది. ధ‌నుష్‌ని అన‌వ‌స‌రంగా అల్లుడ్ని చేసుకున్నారంటూ.. ర‌జ‌నీ ఫ్యాన్స్‌,...

చంద్రబాబు, లోకేష్ కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ !

మామయ్య చంద్రబాబు, లోకేష్ కరోనా నుంచి త్వరలో కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. ఇటీవలి కాలంలో చంద్రబాబు, లోకేష్‌ పుట్టిన రోజలకు కూడా విష్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close