త్వరలో నేనూ సాధారణ పౌరుడయిపోతానోచ్!

నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ఇండో గ్లోబల్ హెల్త్ కేర్, ఫార్మా సదస్సులో ప్రసంగించిన గవర్నర్ నరసింహన్ “నేను త్వరలో సాధారణ పౌరుడునయిపోతా” అని చెప్పడంతో అందరూ ఉలిక్కి పడ్డారు.

ఇదివరకు ఓటుకి నోటు కేసులో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొని ఉన్నప్పుడు ఆయన ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని తెదేపా నేతలు, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు కొందరు విమర్శలు చేసారు. అదే సమయంలో త్వరలోనే గవర్నర్ మారబోతున్నారనే వార్తలు కూడా వచ్చేయి. అధికార పార్టీకి చెందిన నేతలు, మంత్రులే తనపై విమర్శలు గుప్పిస్తుండటంతో కలత చెందిన ఆయన రాజీనామాకు సిద్దపడ్డారని, కానీ కేంద్ర ప్రభుత్వం ఆయనకి నచ్చజెప్పడంతో తన పదవిలో కొనసాగుతున్నారని వార్తలు వచ్చేయి. ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకొంటున్న సమయంలో ఆయన హటాత్తుగా తను పదవిలో నుండి తప్పుకోబోతున్నట్లు ప్రకటించడం అందరినీ చాలా ఆశ్చర్యం కలిగించింది.

రాష్ట్ర విభజనకు ముందు నుంచి నేటి వరకు ఆయన అనేక సమస్యలను, అవమానాలను ఎదుర్కొన్నారు. కానీ ఎన్నడూ తన మనసులో బాధను బయటపెట్టుకోలేదు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురయినా నిబ్బరంగా ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య కుదిర్చి రెండు రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న సమస్యలను, వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు ప్రోత్సహించారు. కానీ ఆయన చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. కానీ ఓటుకి నోటు కేసు బయటపడటంతో రెండు రాష్ట్రప్రభుత్వాల మధ్య భయంకర యుద్ధం జరిగింది. అటువంటి సమయంలో ఆయనే స్వయంగా తప్పుకొన్నా లేదా కేంద్ర ప్రభుత్వమే ఆయనని తప్పించినా అది ఆయనకు ఏమాత్రం గౌరవప్రదంగా ఉండదు. కనుకనే కేంద్ర ప్రభుత్వం సలహా మేరకు ఆయన ఇంతవరకు ఆగి ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకొన్నాయి కనుక తప్పుకోవాలనుకొంటున్నారేమో? ఏమయినప్పటికీ రెండురాష్ట్రాల సమస్యల గురించి మంచి అవగాహన కలిగి ఉన్న అయన తప్పుకొంటే, ఆయన స్థానంలో మరొకరెవరువచ్చినా ఇంతకంటే ఎక్కువ సమస్యలు సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బెల్లంకొండ‌తో అతిథి శంక‌ర్‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్‌, మంచు మ‌నోజ్‌, నారా రోహిత్ క‌లిసి ఓ సినిమా చేస్తున్నారు. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన 'గ‌రుడ‌న్`కి ఇది రీమేక్‌. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి 'వీర ధీర శూర‌'...

సిమ్లాలోనూ మత చిచ్చు !

హిమాచల్ ప్రదేశ్ మొత్తం మీద లక్షన్నర మంది ముస్లింలు ఉంటారు. ఇతర వర్గాలన్నీ కలిపి అరవై లక్షల వరకూ ఉంటారు. అయినా అక్కడ హేట్ పాలిటిక్స్ ప్రారంభమయ్యాయి. సిమ్లాలో...

కామెడీ ఈజ్ కింగ్‌

సర్వేంద్రియానాం న‌య‌నం ప్ర‌ధానం అన్న‌ట్టు.. జోన‌ర్ల‌న్నింటిలోనూ హాస్యం ప్ర‌ధానం అని న‌మ్ముతుంది చిత్ర‌సీమ‌. ప‌క్కాగా నవ్వించాలే కానీ, సినిమా హిట్ట‌వ్వ‌డం గ్యారెంటీ. ఇలాంటి సినిమాల‌కు జ‌నాల్లో రీచ్ కూడా ఎక్కువ‌. ఫ్యామిలీ మొత్తం...

కేసీఆర్ ఆలస్యం చేస్తే జరిగేది ఇదే!

నడిపించే నాయకుడు సైలెంట్ గా ఉండిపోతే ఏం జరుగుతుందన్నది బీఆర్ఎస్ లో జరుగుతోన్న పరిణామాలు కళ్లకు కట్టినట్లుగా చూపిస్తున్నాయి. నేతలకు దిశానిర్దేశం చేసే అధినేత ఏమి పట్టన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో బీఆర్ఎస్ క్రమంగా పట్టు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close