చిన్నమోడిని లండన్‌నుంచి రప్పించాల్సిందే: రాహుల్

హైదరాబాద్: రాహుల్ గాంధిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ప్రత్యర్థులపై తానే విమర్శలతో దాడికి దిగుతున్నారు. ఇవాళ జైపూర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడి, ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడిలపై చెలరేగిపోయారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, ఎన్ని ఆర్డినెన్సులు జారీచేసినా భూసేకరణ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదముద్ర పొందనిచ్చే ప్రసక్తే లేదని అన్నారు. అంగుళం భూమినికూడా కోల్పోనీయబోమని చెప్పారు. ఆరునెలల్లో ఆయన 56 అంగుళాల ఛాతీని 5.6 అంగుళాలకు తగ్గిస్తామంటూ పరోక్షంగా ప్రధాని మోడినుద్దేశించి వ్యంగ్యాస్త్రాలు విసిరారు(లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మోడి తన 56 అంగుళాల ఛాతీగురించి చెప్పుకున్నారు). రాజస్థాన్‌లోని వసుంధర రాజే ప్రభుత్వం అలనాటి బ్రిటిష్ ప్రభుత్వంలాగా లండన్ నుంచి రిమోట్ ద్వారా పనిచేస్తోందని రాహుల్ అన్నారు. రాజస్థాన్‌లో ఉన్నది వసుంధర ప్రభుత్వం కాదని, లలిత్ మోడి ప్రభుత్వమని చెప్పారు. చిన్న మోడి(లలిత్ మోడి)ని లండన్‌నుంచి రప్పించాల్సిందేనని డిమాండ్ చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అస‌లైన బంగార్రాజు నాన్న‌గారే: నాగార్జున‌

ఈ సంక్రాంతి 'బంగార్రాజు'దే. తొలి మూడు రోజులూ మంచి వ‌సూళ్లు తెచ్చుకుంది. సోమ‌వారం కూడా వ‌సూళ్ల హ‌వా త‌గ్గ‌లేదు. ఈ వ‌సూళ్లు, అంకెలు నాగ్ ని సంతోషంలో ముంచెత్తాయి. ఆ ఆనందం.. రాజ‌మండ్రి...

జ‌గ‌న్ కి థ్యాంక్స్ చెప్పిన నాగ్‌

సినిమా టికెట్ రేట్లు, ఇత‌ర‌త్రా వ్య‌వ‌హారాల‌పై ఇటీవ‌ల చిరంజీవి - జ‌గ‌న్ ల మ‌ధ్య భేటీ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఆ భేటీలో సినిమా ప‌రిశ్ర‌మ‌కు చెందిన‌చాలా విష‌యాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయ‌ని తెలిసింది.కాక‌పోతే.....

విడాకుల సైడ్ ఎఫెక్ట్స్ : ర‌జ‌నీ ఫ్యాన్స్ VS ధ‌నుష్ ఫ్యాన్స్‌

విడాకుల ప్ర‌క‌ట‌న వ‌చ్చి 24 గంట‌లు గ‌డిచిందో లేదో.. అప్పుడే త‌మిళ నాట ర‌జ‌నీ ఫ్యాన్స్, ధ‌నుష్ ఫ్యాన్స్ మ‌ధ్య మాట‌ల యుద్ధం మొద‌లైపోయింది. ధ‌నుష్‌ని అన‌వ‌స‌రంగా అల్లుడ్ని చేసుకున్నారంటూ.. ర‌జ‌నీ ఫ్యాన్స్‌,...

చంద్రబాబు, లోకేష్ కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ !

మామయ్య చంద్రబాబు, లోకేష్ కరోనా నుంచి త్వరలో కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. ఇటీవలి కాలంలో చంద్రబాబు, లోకేష్‌ పుట్టిన రోజలకు కూడా విష్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close