రాజమౌళి ఇప్పుడు ఏం చేస్తున్నారు?

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సినిమా అభిమానులందరూ చర్చించుకునేవిధంగా బాహుబలివంటి అపూర్వమైన చిత్రాన్నితీసి రాజమౌళి అందరి దృష్టీ ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్‌లో రికార్డులమీద రికార్డులు సృష్టిస్తున్న ఈ సమయంలో అసలు రాజమౌళి ఏమి చేస్తున్నారో అని అందరికీ ఒక ఆలోచన రావటం సహజం. నిన్నటితో బాహుబలికి మొదటివారం పూర్తవటంతో ఇవాళ్టినుంచి రాజమౌళి రిలాక్సవుతున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలు, ఇంటర్వ్యూల హడావుడినుంచి కాస్త విరామం తీసుకుందామని అనుకున్నట్లున్నారు. కొద్దిరోజులపాటు సెలవులు తీసుకుంటానని, ఫ్యామిలీకి సమయం కేటాయిస్తానని ఇవాళ ఉదయం ట్వీట్ చేశారు. స్విట్జర్లాండ్‌నుంచి తిరిగిరాగానే బాహుబలి ప్రభంజనంపై స్పందించి టీమ్‌కు అభినందనలు తెలిపిన మహేష్‌కు ట్విట్టర్‌ద్వారానే కృతజ్ఞతలు తెలిపారు.

బాహుబలి – 2 షూటింగ్ సెప్టెంబర్‌నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. మరోవైపు బాహుబలి ఇంటర్నేషనల్ వెర్షన్ పనులను ఆగస్టుకల్లా పూర్తిచేయాలని రాజమౌళి యోచిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close