రాజ్ కెసిరెడ్డికి క్రిమినల్ మైండ్ సెట్ ఉంటే గోవా నుంచి హైదరాబాద్కు ఫ్లైట్లో వచ్చేవాడా అని పేర్ని నాని అమాయకంగా ప్రశ్నించాడు. నిజమే తాను అంత కంటే ఎక్కువ అమాయకుడ్నని కేసిరెడ్డి తాజాగా మరోసారి నిరూపించారు. హైదరాబాద్ శివారు ఫామ్ హౌస్లో దొరికిన రూ. 11 కోట్ల గురించి ఓ విచిత్రమైన పిటిషన్ కోర్టులో వేశాడు. అదేమిటంటే.. ఆ డబ్బులు కొత్తగా ప్రింట్ చేసినవని.. వాటితో లిక్కర్ కేసుకు సంబంధం లేదని వాదిస్తున్నారు. కావాలంటే ఆర్బీఐతో చెక్ చేయించాలని ఆయన కోర్టులో పిటిషన్ వేశారు.
ఆ డబ్బుల విషయంలో ఎంత క్లారిటీ ఉంటే రాజ్ కెసిరెడ్డి ఇలాంటి పిటిషన్ వేస్తారని .. వైసీపీ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. ఆ ఫామ్ హౌస్ తన డిస్టిలరీ వ్యాపార భాగస్వామి, హాస్పిటల్స్ సహా ఇతర వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్న వ్యక్తి పేరు మీద ఉంది. అలాంటి చోట్ల డబ్బులు దొరికినా తనకు సంబంధం లేదని వాదిస్తున్నారు. అది నిరూపించడానికి కావాలంటే ఆ డబ్బుల మీద ఉన్న నెంబర్లు ఆర్బీఐకి పంపాలంటున్నారు.
లిక్కర్ స్కామ్ లో డబ్బులు తాము జూన్ 2024లో అక్కడ పెట్టామని రాజ్ కెసిరెడ్డి ..దందాలో కీలకంగా వ్యవహరించిన వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారంతోనే వాటిని పట్టుకున్నారు. ఇప్పుడు ఆ డబ్బులు తనవి కావని ఓ సారి .. లిక్కర్ స్కాంవి కావని మరోసారి.. ఇతర వ్యాపారాల్లో బ్లాక్ మనీ అని మరోసారి వాదిస్తున్నారు. కోర్టు ఏం చెబుతుందో.. ఆ పదకొండు కోట్లపై.. చాలా బాగా రాజ్ కెసిరెడ్డికి తెలుసన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.