రాజ్‌త‌రుణ్ పూర్తిగా మారిపోయాడు

ఉయ్యాల జంపాల‌, అష్టాచ‌మ్మా సినిమాలతో ఒక్క‌సారిగా ఇండ్ర‌స్ట్రీ దృష్టిలో ప‌డ్డాడు రాజ్‌త‌రుణ్‌. మంచి ఈజ్‌, స‌హ‌జ‌మైన న‌ట‌న‌, కామెడీ టైమింగ్ ఇవ‌న్నీ క‌లిసి రావ‌డంతో.. అవ‌కాశాలు వెంబ‌డించాయి. `సినిమా చూపిస్త మావ‌`తో మాస్ హిట్టూ అందుకున్నాడు. ఆ త‌ర‌వాత‌.. వ‌రుస ఫ్లాపులు. త‌ప్పు ఎక్క‌డ జ‌రుగుతుందో, ఏమో అని చెక్ చేసుకునే లోగా… రాజ్ త‌రుణ్ కెరీర్‌నే డేంజ‌ర్‌జోన్ లో ప‌డిపోయింది. `ఇక నుంచి రెగ్యుల‌ర్ సినిమాలు చేయ‌ను.. క‌చ్చితంగా కొత్త పాయింట్ ఉంటేనే ఒప్పుకుంటా` అని ఈమ‌ధ్య రాజ్ త‌రుణ్‌.. ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.

ఇప్పుడు ఆ ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టిన‌ట్టే అనిపిస్తోంది. రాజ్ త‌రుణ్ కొత్త‌గా `ప‌వ‌ర్ ప్లే` అనే సినిమా చేస్తున్నాడు. కొండా విజ‌య్ కుమార్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌పోస్ట‌ర్ లో రాజ్ త‌రుణ్ లుక్‌.. షాక్ ఇచ్చింది. క‌ళ్ల‌జోడు, చేతిలో పిస్టోల్ తో.. సీరియ‌స్ లుక్ లో క‌నిపించాడు రాజ్ త‌రుణ్‌. విజ‌య్ కుమార్ కొండా.. ల‌వ్‌స్టోరీలు బాగా తీస్తాడు. త‌న‌ది కామెడీ స్టైల్‌. రాజ్ త‌రుణ్ కూడా అంతే. వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన `ఒరేయ్ బుజ్జిగా` వినోదాత్మ‌కంగానే సాగింది. ఇప్పుడు వీళ్లు కామెడీ సినిమానే తీస్తార‌నుకుంటే `ప‌వ‌ర్ ప్లే` అనే టైటిల్ తో, రాజ్ త‌రుణ్‌లుక్ తో షాక్ ఇచ్చారు. ఇదో థ్రిల్ల‌ర్. ఓ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ నేప‌థ్యంలో సాగుతుంద‌ని టాక్‌. రాజ్ త‌రుణ్ క్యారెక్ట‌రైజేష‌న్‌, త‌న బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాలో పూర్తిగా కొత్త‌గా క‌నిపించ‌బోతున్నార్ట‌. చూద్దాం.. త‌రుణ్ మారితే సంతోష‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉమెన్స్ డే రోజూ అమరావతి మహిళా రైతులకు దెబ్బలే..!

మహిళా దినోత్సవం రోజునా అమరావతి మహిళా రైతులకు ఎలాంటి గౌరవం లభించలేదు సరి కదా.. పోలీసులు చేతిలో దెబ్బలు తినాల్సి వచ్చింది. ఓ వైపు మహిళలకు అండగా నిలబడతామని పెద్ద పెద్ద ప్రకటనలు...

తొలి 10 నిమిషాలు ముందే చూపించేస్తార్ట‌!

మంచు విష్ణు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం మోస‌గాళ్లు. ఇదో వైట్ కాల‌ర్ మోసం చుట్టూ తిరిగే క‌థ‌. టెక్నాల‌జీని వాడుకుంటూ... మోస‌గాళ్లు ఎలా రెచ్చిపోతున్నారో చెప్పే క‌థ‌. ట్రైల‌ర్ ఇటీవ‌లే విడుద‌లైంది. కాజ‌ల్,...

బాల‌య్య రైట్ హ్యాండ్‌.. జ‌గ్గూ భాయ్‌

లెజెండ్‌తో.. జ‌గ‌ప‌తిబాబులోని విల‌న్ విశ్వరూపం చూపించాడు. ఆ సినిమాతో జ‌గ‌పతి బాబు కెరీర్ ట‌ర్న్ అయిపోయింది. హీరోగా ఎంత సంపాదించాడో తెలీదు గానీ, విల‌న్ గా మారాక మాత్రం జ‌గ‌ప‌తి ఆస్తులు పెరిగాయి....
video

మ‌హిళా శ‌క్తి @ విరాట ప‌ర్వం

https://www.youtube.com/watch?v=dQ9S_uy-5sM విరాట‌ప‌ర్వం... ఈ సినిమా పేరు చెప్ప‌గానే ఓ ప్రేమ‌క‌థో, ఓ విప్ల‌వ గాథో, ఓ అభ్యుద‌య చిత్ర‌మో, ఓ సామాజిక స్పృహ ఉన్న ప్ర‌య‌త్న‌మో... అనిపిస్తోంది. పోస్ట‌ర్లూ అలానే ఉన్నాయి. అయితే.....

HOT NEWS

[X] Close
[X] Close