స్టాండప్‌ రాహుల్‌ ట్రైలర్.. పెళ్ళా ? సహజీవనమా ?

రాజ్‌ తరుణ్‌ కి ఏదీ కలసి రావడం లేదు. కథల ఎంపికలో రాజ్ లెక్క తప్పుతుంది. గత కొన్నాళ్ళుగా విజయాలు లేవు. అయితే ప్రయత్నాలు మాత్రం చేస్తూనే వున్నాడు. ఇప్పుడు రాజ్ నుంచి మరో యూత్ ఫుల్ సినిమా వస్తుంది. అదే ‘స్టాండప్‌ రాహుల్‌’. వర్ష బొల్లమ్మ హీరోయిన్. శాంటో మోహన్‌ వీరంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ బయటికి వచ్చింది. ‘స్టాండప్‌ కమెడియన్ గా రాహుల్ చేసిన డబుల్ కామెడీతో మొదలైన ట్రైలర్ అదే డబుల్ మీనింగ్ కామెడీతో ఎండ్ అయ్యింది. యూత్ కి ఆడియన్స్ టార్గెట్ గా తీసిన సినిమా. ట్రైలర్ చాలా వరకూ యూత్ కనెక్ట్ అయ్యే అంశాలే చూపించారు. పెళ్ళా ? సహజీవనామా ? అనే టాపిక్కులు కూడా టచ్ చేశారు.

”ఎలాంటి పరిస్థితులలోనైనా పెళ్లి కలిసుంటామనే నమ్మకం ఇస్తుందని హీరోయిన్ అంటే.. బలవంతంగా కలిసుండే పరిస్థితి నుంచి లీవిన్ తప్పిస్తుందని హీరో చెప్పడం సినిమా కాన్సెప్ట్ ని తెలియజేస్తున్నాయి. జీవితంలో ఏ విషయంపై కూడా నిలబడే మనస్తత్వం లేని రాహుల్ .. ప్రేమ, పెళ్లి విషయంలో ఏం చేశాడనేది ఈ సినిమా పాయింట్. ట్రైలర్ రాజ్‌ తరుణ్‌- వర్ష జోడీ ఫ్రెష్ గా వుంది. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ, ఇంద్రజ ట్రైలర్ లో కనిపించారు. ఈ చిత్రాన్ని డ్రీమ్‌ టౌన్‌ ప్రొడక్షన్స్‌, హైఫై పిక్చర్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. మార్చి 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

1 COMMENT

Comments are closed.