2026 సంక్రాంతి మామూలుగా ఉండడం లేదు. రాజాసాబ్, మన శివశంకర ప్రసాద్ గారూ సినిమాలు రిలీజ్‌కి రెడీ అయ్యాయి. అనగనగా ఒకరాజు కూడా పండక్కే వస్తున్నట్టు ప్రకటించేశారు. రవితేజ నుంచి `అనార్కలి` రావొచ్చు. ఇవి కాకుండా తమిళం నుంచి రెండు డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి. వాటిలో విజయ్ సినిమా కూడా ఉంది.
ముఖ్యంగా తెలుగులో ‘రాజాసాబ్’. ‘మన శివ శంకర ప్రసాద్ గారూ’ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. వీటి మధ్య ఆసక్తికరమైన పోటీ చూసే అవకాశం కలుగుతోంది. ‘రాజాసాబ్’ అయితే అప్పుడే తన హడావుడి మొదలెట్టేశాడు. దసరా సందర్భంగా ఓ ట్రైలర్ వదిలారు. సినిమా విడుదలకు దాదాపు 100 రోజుల ముందే ట్రైలర్ విడుదల చేయడం అంటే ఆశ్చర్యకమైన సంగతే. బిజినెస్ వర్గాల్ని ఆకర్షించడానికీ, పాన్ ఇండియా మార్కెట్ దృష్టిలో పడడానికి ఈ ట్రైలర్ చాలా అవసరం కూడానూ.
ఒకట్రెండు పాటలు మినహా షూటింగ్ కూడా పూర్తయినట్టే. గ్రీస్ లో రెండు పాటల్ని తెరకెక్కించాల్సివుంది. దాంతో రాసాజాబ్ వర్క్ ఫినిష్ అవుతుంది. అంటే మిగిలిన సినిమాలకంటే వర్క్ విషయంలోనూ `రాజాసాబ్` ముందున్నడన్నమాట. అనిల్ రావిపూడి కూడా చాలా ఫాస్టు. తను వేగంగా సినిమాతీయగలడు. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయ్యింది. నవంబరు నెలాఖరులో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఆ తరవాత ప్రీ ప్రొడక్షన్. చిరంజీవి బర్త్ డేకి విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకొంది. నవీన్ పొలిశెట్టి హీరోగా రూపొందిన ‘అనగనగా ఒకరాజు’ షూటింగ్ జరుగుతోంది. ఇటీవలే రిలీజ్ ఎనౌన్స్మెంట్ టీజర్ వదిలారు. అది చాలా సరదాగా సాగింది. ఆ సినిమా పోగ్రెస్ వివరాలు తెలియాల్సివుంది. రవితేజ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇప్పటి వరకూ బయటకు రాలేదు. ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా, రాదా? అనే విషయంలోనూ స్పష్టత లేదు. కానీ చిత్రబృందం మాత్రం సంక్రాంతిని టార్గెట్ చేసుకొనే ఈ సినిమాని మొదలెట్టారు.
మిగిలిన సినిమాలతో పోలిస్తే.. `రాజాసాబ్` వర్క్ విషయంలో ముందంజలో ఉంది. అన్నీ ఫ్యామిలీ సినిమాలే అయినా.. రాజాసాబ్ లో విజువల్ ఎఫెక్ట్స్ పిలల్ల్ని ధియేటర్లకు రప్పించే అవకాశం ఉంది. సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ. మిగిలిన సినిమాల కంటెంట్ బయటకు వచ్చిన తరవాతే వాటి గురించి మాట్లాడుకోగలం. కానీ ఒక్కటి మాత్రం నిజం… రాజాసాబ్ కొత్త ట్రైలర్.. మిగిలిన సినిమాలపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. వాళ్లు కూడా తమ సినిమా ఎలాంటిదో, సినిమా ద్వారా ఏం చెప్పాలనుంటున్నారో అభిమానులకు గ్లింప్స్, టీజర్ల ద్వారా సమాచారం అందించే ప్రయత్నాలు చేయొచ్చు. దీపావళికి ఆయా సినిమాల అప్ డేట్లు బయటకు రావొచ్చు.