ప్రభాస్ ‘ది రాజా సాబ్’ మరోసారి వాయిదా పడనుందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ రూమర్స్. అనుకున్న సమయానికే రాజాసాబ్ వస్తుంది. దీనిపై పీపుల్ మీడియా ఫాక్టరీ క్లారిటీ ఇచ్చింది. ‘‘వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 9న అన్ని భాషల్లో ఒకేసారి విడుదల. డిసెంబర్లో అమెరికాలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపనున్నాం. డిసెంబర్ 25లోపు అన్ని పనులు పూర్తిచేసి ఫస్ట్ కాపీ రెడీ’ అని నోట్ రిలీజ్ చేసింది.
మారుతి దర్శకత్వం వహిస్తున్న సినిమా. హారర్ కామెడీ చేయడంప్రభాస్ కి ఇదే తొలిసారి. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్. సంజయ్‌దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ట్రైలర్ లో మంచి వీఎఫ్ఎక్స్ వర్క్ కనిపించింది. ఈ తరహా సినిమాల్లో ప్రభాస్ ని చూడటం ఫ్యాన్స్ కి కొత్త ఎక్స్ పీరియన్స్. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయబోతున్నారు.
