కౌంటింగ్ మర్నాడే ఆస్ట్రేలియాకు రాజగోపాల్ రెడ్డి !

అన్న ఆస్ట్రేలియాకు వెళ్లారు.. తిరిగి వచ్చారు. తమ్ముడు వెళ్లబోతున్నారు. కుటుంబసమేతంగానే. అక్కడ హాలీడేస్ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. వస్తున్నారు. అక్కడికే ఎందుకు… అంటే మాత్రం.. ఆ విషయం వారికే తెలియాలి. మునుగోడు ఉపఎన్నికల్లో కౌంటింగ్ ముగియగానే రాజగోపాల్ రెడ్డి ఆస్ట్రేలియా వెళ్లిపోతున్నారు. తనకు.. తన భార్య కోసం బుక్ చేసుకున్న టిక్కెట్లు ఈ మేరకు వెలుగులోకి వచ్చాయి.

ఈ నెల 6 వ తేదీన ఫలితాలు ప్రకటించగానే 7వ తేదీన ఆస్ట్రేలియా టూర్‌కు వెళుతున్నట్లు తెలుస్తోంది. విశ్రాంతి కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లబోతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తన ప్రయాణానికి సంబంధించి బుక్ చేసుకున్న విమాన టిక్కెట్లు కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. గత నెల 15న ఆస్ట్రేలియాకు వెళ్లిన ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. హైదరాబాద్‌కు వచ్చేశారు.

ఉపఎన్నికల్లో ఫలితంతో సంబంధం లేకుండా రాజగోపాల్ రెడ్డి విశ్రాంతి కోసం ఆస్ట్రేలియా వెళ్తున్నారని.. అంటున్నారు. అయితే ఆయన సోదరుని కుటుంబం ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చేసింది. ఇప్పుడు మళ్లీ ఆయన కూడా అక్కడకే ఎందుకు వెళ్తారని అంటున్నారు. ఇటీవలి కాలంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన బ్యాంక్ అకౌంట్ల వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు ఆయన టిక్కెట్ల వివరాలు కూడా రావడంతో బీజేపీ నేతలు తమ ఫోన్లపై నిఘా పెట్టారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ అంశంపై రాజగోపాల్ రెడ్డి ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు – జైలు – వాయిదాలు !

ఎఫ్ఐఆర్ కూడా లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ న్యాయం కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్లపై తీర్పులు మాత్రం.. అంత వేగంగా రావడం లేదు. ఎప్పుడొస్తాయో తెలియదన్నట్లుగా సీన్...

అనసూయ కన్నీళ్లకి అసలు కారణం ఇదే

యాంకర్, నటి అనసూయ ఇటివలే షేర్‌ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ఆమె కన్నీటి పర్యంతమవుతూ కనిపించారు. ఆన్‌లైన్‌ల ట్రోల్స్ వల్లే ఆమె కన్నీళ్లు పెట్టుకుందని నెట్టింట ప్రచారం...

ప్రభాస్ ‘కల్కి’తో జాగ్రత్త!

ప్రభాస్‌ తో నాగ్ అశ్విన్‌ రూపొందిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’. కమల్‌ హాసన్‌ విలన్‌, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, దీపిక పదుకొణె, దిశా పటానీ ఇలా...

అసెంబ్లీలో 10 మంది టీడీపీ ఎమ్మెల్యేల్ని ఎదుర్కోలేక నైతిక పతనమైన వైసీపీ!

అసెంబ్లీలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీకి గట్టిగా పదిహేను మంది ఉన్నారు. వారిలో ఐదుగురు సైలెంట్ గా ఉంటారు. మహా అయితే గట్టిగా ఓ పది మంది టీడీపీ సభ్యులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close