బారికేడ్లలో రాజమండ్రి బందీ! ప్రజలను ఇబ్బందిపెడుతున్న పోలీసుల ధోరణి!

దేశంలో మరెక్కడాలేనంత పొడవైన స్నానఘట్టాన్ని రాజమండ్రి కొటిలింగాల పేట వద్ద నిర్మించారు. ఒకటింపావు (1128 మీటర్లు) కిలోమీటర్లున్న ఈ ఘాట్ నిర్మాణానికి 14 కోట్లరూపాయలు ఖర్చుపెట్టారు. రాజమండ్రిలో 13 మార్గాల ద్వారా ఈ ఘాట్ కి చేరుకోవచ్చు. అయితే ఈ ఘాట్వాలు తక్కువగా వుండటం, హెచ్చు మెట్లు వుండటం వయోవృద్ధులకు ఆయాసమే, తీవ్రఅసౌకర్యమే! ఇంకో నాలుగు రోజుల్లో గోదావరి పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి.

విస్తరించి, విలీనంచేసి, కొత్తగా నిర్మించీ రాజమండ్రిలో గతంలో వున్న 16 ఘాట్లను 22 కి పెంచారు. అప్పట్లో అన్ని ఘాట్లపొడవూ రెండు కిలోమీటర్లలోపే. ఇపుడది మూడు ముప్పావు కిలోమీటర్లకు విస్తరించింది. ఒక చదరపు మీటర్ లో ఆరుగురు మూడేసి నిమిషాలు స్నానం చేసినా రోజుకి 12 లక్షల మంది నదీస్నానం చేయవచ్చని వాటర్ రిసోర్సెస్ డిపార్టుమెంటు ఎస్ ఇ సుగుణాకరరావు చెప్పారు. ప్రభుత్వ అంచనా ప్రకారం పుష్కర యాత్రికుల సంఖ్య గరిష్టంగా రోజుకి పది లక్షలు కాబట్టి ఘాట్ లలో ఏరద్దీ వత్తిడి లేకుండా స్నానాలు ముగించుకోవచ్చని వివరించారు. అయితే పోలీసులు మాత్రం ఊరంతటినీ బారికేడ్లతో బంధించేశారు. ఇందువల్ల నగరం ఒడ్డున నాలుగు కిలోమీటర్ల పొడవునా వున్న గోదావరి బండ్ రోడ్డుకి అప్రోచ్ లుగా వున్న ఇరవైకి పైగా వీధుల్లో నివశించేవారి రాకపోకలకు నడకతప్ప మరో మార్గం లేకుండాపోయింది. గతపుష్కరాల్లో బారికేడ్లు బండ్ రోడ్డులో మాత్రమే వుండేవి. యాత్రికులు ఏవిధమైన తోపులాటలూ లేకుండా స్నానానికి వెళ్ళడం తిరిగి రావడం జరిగేది.రాజమండ్రివాసుల దైనందిన జీవితాలకు అంతరాయాలు వుండేవి కాదు..ఇపుడు వీధుల్లో కూడా బారికేడ్లవల్ల అవసరం లేకపోయినా క్యూలోనే వెళ్ళి రావడం విపరీతమైన జాప్యానికి దారితీస్తుంది. నడకలో వెనుకబడిన విరికోసం ముందు వెళుతున్నవారు ఆగే అవకాశంలేదు.

ఈ విషయమే ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోలీసు ఉన్నతాధికారులకు వివరించి వీధుల్లో బారికేడ్లు అవసరంలేదని సూచించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం అన్నారే తప్ప బారికేడ్లు తొలగిస్తామని మాత్రం పోలీసు అధికారులు ప్రకటించలేదు. పాతపుష్కరాల ఏర్పాట్ల ప్రకారమే ఈ సారీ చేయవచ్చుకదా అని ప్రశ్నించినపుడు అప్పుడు ఏమి జరిగాయో రికార్డులు లేవు అని ఒక టె్రయినీ ఆఫీసర్ చెప్పారు. పెద్దపెద్ద ఈవెంట్లను సవివరంగా డాక్యుమెంటు చేయకపోవడం మన యంతా్రంగంలో వున్న పెద్దలోపం! యాత్రికుల వసతికోసం కోట్లరూపాయల ఖర్చుతో వేర్వేరు శాఖలు ఎన్నెన్నో సదుపాయాలు కల్పిస్తూండగా యాత్రికులను ప్రయాసపెట్టడానికే నడుముబిగించినట్టున్న పోలీసుశాఖ ధోరణి ముఖ్యమంత్రి చెబితేతప్ప వినేదిలేదు అన్నట్టు వుంది. సువిశాలమైన సీసా కు ఇరుకైన మూతిలా వున్న పరిస్ధితి పోలీసులే ప్రజల మూమెంటును కషా్టలపాలు చేసేలా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]