జక్క‌న్న‌కు అంత టైమ్ ఉందా?

రాజ‌మౌళి ఈమ‌ధ్య బ‌య‌ట ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఫంక్ష‌న్ల‌లో మెర‌వ‌డం చాలా త‌క్కువ‌. సినిమా వేడుక‌ల్లో చూడ‌డం వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. త‌న టైమ్ అంతా మ‌హేష్ బాబు సినిమా కోస‌మే. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ త‌ర‌వాత రాజ‌మౌళి చేస్తున్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు మ‌రింతగా పెరిగాయి. పైగా… మ‌హేష్ తో ఓ సినిమా చేయాల‌ని జ‌క్క‌న్న ఎప్ప‌టి నుంచో భావిస్తున్నాడు. అందుకే… త‌న ఫోక‌స్ అంతా… ఈ సినిమాపైనే పెట్టాడు.

అయితే అనుకోకుండా రాజ‌మౌళికి కొంత బ్రేక్ దొరికిందేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఈమ‌ధ్య త‌ను సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాడు. ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో త‌న అర్థాంగితో క‌లిసి ‘ప్రేమికుడు’ పాట‌కు స్టెప్పులు వేశాడు జక్క‌న్న‌. ఆ పాట కోసం రిహార్స‌ల్స్ కూడా చేశాడు. అంతేకాదు.. ఇప్పుడు వార్న‌ర్‌తో చేసిన ఓ యాడ్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. సాధార‌ణంగా జక్క‌న్న క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ జోలికి వెళ్ల‌డు. కానీ తొలిసారి అది కూడా చేసేశాడు. ఓ ప‌క్క మ‌హేష్ సినిమా కోసం త‌ల‌మున‌క‌లు అవుతూనే మ‌రోవైపు.. ఇంత టైమ్ ఎలా కేటాయిస్తున్నాడో అర్థం కావ‌డం లేదు. బ‌హుశా.. ప‌ని నుంచి కాస్త బ్రేక్ కావాలంటే మ‌రో ప‌నేదో పెట్టుకోవ‌డం రాజ‌మౌళి స్టైలేమో..? మొత్తానికి రాజ‌మౌళి వార్న‌ర్ యాడ్.. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. ఈ యాడ్‌తో, ప్రేమికుడు స్టెప్పుల‌తో జక్క‌న్న‌లోని టాలెంట్ మ‌రో కోణంలో బ‌య‌ట‌ప‌డింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భ‌ళా బెంగ‌ళూరు..ప్లే ఆఫ్‌లో చోటు

ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే.. అందులో 7 ఓట‌ములు. పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్ట చివ‌రి స్థానం. ఇలాంటి ద‌శ‌లో బెంగ‌ళూరు ప్లే ఆఫ్‌కి వెళ్తుంద‌ని ఎవ‌రైనా ఊహించి ఉంటారా? కానీ బెంగ‌ళూరు అద్భుతం...

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close