శ్రీ‌నువైట్ల‌… రూటు మార్చేశాడా?

కామెడీని పండించ‌డంలో శ్రీ‌నువైట్ల‌ది సెప‌రేట్ స్కూల్‌. ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఓ గుర్తింపు వ‌చ్చింది ఎంట‌ర్‌టైన్మెంట్ సినిమాల వ‌ల్లే. ‘దూకుడు’ లాంటి ఇండ‌స్ట్రీ హిట్ ఇచ్చిన రికార్డ్ శ్రీ‌నువైట్ల‌కు ఉంది. అయితే… కొంత‌కాలంగా వైట్ల‌కు హిట్లు ద‌క్క‌డం లేదు. తీసిన సినిమా ఫ్లాపై కూర్చొంటోంది. ఒకప్పుడు బ‌డా బ‌డా హీరోలు శ్రీ‌నువైట్ల వెనుక తిరిగే వారు. ఇప్పుడు శ్రీ‌నుకి హీరోలు దొర‌క‌డ‌మే క‌ష్ట‌మైపోతోంది. ఇలాంటి త‌రుణంలో గోపీచంద్ తో ఓ సినిమా తీస్తున్నాడు శ్రీ‌నువైట్ల‌. అదే.. ‘విశ్వ‌మ్‌’.

గోపీచంద్ – శ్రీ‌నువైట్ల‌.. ఇద్ద‌రూ రెండు భిన్న ధృవాలే. గోపీచంద్ పైయాక్ష‌న్ ఇమేజ్ ఉంది. గోపీచంద్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమాలు చేశాడు కానీ, త‌న‌ని యాక్ష‌న్ హీరోగానే చూస్తారంతా. శ్రీ‌నువైట్ల ఎలాంటి సినిమా చేసినా అందులో ఎంట‌ర్టైన్‌మెంట్ ఉండాల్సిందే. విశ్వమ్ ఫ‌స్ట్ గ్లింప్స్ చూస్తే… సినిమా పూర్తిగా యాక్ష‌న్ తో నింపేసిన‌ట్టు క‌నిపిస్తోంది. గోపీచంద్ కోసం శ్రీ‌నునే త‌న స్టైల్ మార్చాడ‌నిపిస్తోంది. ఓరకంగా ఇది మంచిదే. హీరో బాడీ లాంగ్వేజ్‌ని బ‌ట్టి, క‌థ‌లు రాసుకొంటే మంచి ఫ‌లితాలొస్తాయి. కాక‌పోతే… శ్రీ‌నువైట్ల సినిమాలంటే ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఆశించి వెళ్తారు. `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ` ఫ్లాప్ అవ్వ‌డానికి కార‌ణం.. శ్రీ‌ను మార్క్ కామెడీ లేక‌పోవ‌డ‌మే. మ‌రి ఈసారి ఏం రిజ‌ల్ట్ వ‌స్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంత మోసమా కొమ్మినేని ? వైసీపీ క్యాడర్‌ని బలి చేస్తారా ?

వైసీపీ క్యాడర్ ను ఆ పార్టీ నేతలు, చివరికి సాక్షిజర్నలిస్టులు కూడా ఘోరంగా మోసం చేస్తున్నారు. ఫేకుల్లో ఫేక్ .. ఎవరు చూసినా ఫేక్ అని నమ్మే ఓ గ్రాఫిక్...

భ‌ళా బెంగ‌ళూరు..ప్లే ఆఫ్‌లో చోటు

ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే.. అందులో 7 ఓట‌ములు. పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్ట చివ‌రి స్థానం. ఇలాంటి ద‌శ‌లో బెంగ‌ళూరు ప్లే ఆఫ్‌కి వెళ్తుంద‌ని ఎవ‌రైనా ఊహించి ఉంటారా? కానీ బెంగ‌ళూరు అద్భుతం...

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close