సంక్రాంతి బ‌రిలో మ‌రో హీరో

ఇప్ప‌టికే సంక్రాంతి బెర్తులు నిండిపోయాయి. ఆర్‌.ఆర్‌.ఆర్ ఒక‌వైపు… రాధే శ్యామ్ మ‌రో వైపు ఉన్నాయి. భీమ్లా నాయ‌క్‌, స‌ర్కారు వారి పాట సినిమాలు సైతం ఇప్ప‌టికైతే సంక్రాంతికే వ‌స్తున్నాయి. మ‌రో వైపు బంగార్రాజు కూడా `నేను సైతం` అంటున్నాడు. వీట‌న్నింటి మ‌ధ్య మ‌రో సినిమాకి చోటే లేదు. భీమ్లా నాయ‌క్‌, స‌ర్కారు వారి పాట‌.. రేసు నుంచి త‌ప్పుకున్నా – మూడు సినిమాల‌తో బాక్సాఫీసు ర‌ష్ గా మారిపోతుంది. అయితే ఇప్పుడు మ‌రో హీరో కూడా సంక్రాంతి బ‌రిలో దిగ‌డానికి రెడీ అయిపోయాడు. త‌నే రాజ‌శేఖ‌ర్‌. త‌న `శేఖ‌ర్‌` సినిమాని ఈ పండ‌క్కి విడుద‌ల చేయాల‌ని ఫిక్స‌య్యాడ‌ట‌.

ఇది వ‌ర‌కైతే రాజ‌శేఖ‌ర్ ని కాస్త లైట్ తీసుకునే అవ‌కాశం ఉండేది. అయితే గ‌రుడ వేగ‌తో త‌న లో స్టామినా త‌గ్గ‌లేద‌ని నిరూపించాడు రాజ‌శేఖ‌ర్‌. ఆ త‌ర‌వాత క‌ల్కికి కూడా మంచి ఓపెనింగ్స్ వ‌చ్చాయి. దాంతో శేఖ‌ర్ పై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇందులో రాజ‌శేఖ‌ర్ గెట‌ప్ కొత్త‌గా అనిపిస్తోంది. తొలిసారి వ‌య‌సుకి త‌గ్గ పాత్ర పోషిస్తున్నారాయ‌న‌. ఇదో థ్రిల్ల‌ర్ కాబ‌ట్టి – ఆ జోన‌ర్ కి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది కాబ‌ట్టి, శేఖ‌ర్ పై ఆశ‌లు పెట్టుకోవ‌చ్చు. కాక‌పోతే… సంక్రాంతి సీజ‌న్ లో రావ‌డం కొంత రిస్కే. ఇన్ని సినిమాల మధ్య రాజ‌శేఖ‌ర్ త‌న స్టామినాని చూపించాలంటే అద్భుతం సృష్టించాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

22మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లోకి హరీష్..!?

బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హారీష్ రావు కాంగ్రెస్ లో చేరనున్నారా..? 20-22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతుండగా..ఆ ఎమ్మెల్యేల వెనక బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు...

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close