ఇక రాజ‌శేఖ‌ర్ మ‌ల్టీస్టార‌ర్‌…

మ‌ల్టీస్టార‌ర్ ప‌రంప‌ర‌లో సీనియ‌ర్ హీరోలు భాగం పంచుకుంటున్నారు. క‌థ న‌చ్చితే మ‌రో హీరోతో క‌లిసి న‌టించ‌డానికి, స్క్రీన్ షేర్ చేసుకోవ‌డానికి వెనుకాడ‌డం లేదు. తాజాగా రాజ‌శేఖ‌ర్ కూడా ఓ మ‌ల్టీస్టార‌ర్‌లో భాగం పంచుకోబోతున్నార‌ని స‌మాచారం. రాజ‌శేఖ‌ర్ క‌థానాయ‌కుడిగా వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇది సోలో హీరో సినిమా అనుకున్నారంతా. కానీ.. రాజ‌శేఖ‌ర్ తో పాటు మ‌రో యువ హీరో కూడా ఇందులో న‌టించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. శ్రీ‌విష్ఱు, కార్తికేయ‌లాంటి పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. ఇద్ద‌రిలో ఎవ‌రు కుదిరినా, ఈ కాంబినేష‌న్‌కి ఓ క్రేజ్ వ‌చ్చిన‌ట్టే. ‘అహ‌నా పెళ్లంట‌’ సినిమాతో ద‌ర్శ‌కుడిగా నిరూపించుకున్నాడు వీర‌భ‌ద్ర‌మ్‌. ఆదితో తీసిన ‘చుట్టాల‌బ్బాయ్‌’ కూడా ఓకే అనిపించుకుంది. ఆ సినిమా త‌ర‌వాత వీర‌భ‌ద్ర‌మ్‌కి చాలా గ్యాప్ వ‌చ్చేసింది. అయితే ఇప్పుడు వ‌రుస‌గా రెండు సినిమాల్ని ప‌ట్టాలెక్కించ‌డానికి ఆయ‌న రెడీ అయ్యారు. అందులో రాజ‌శేఖ‌ర్ సినిమా ఒక‌టి. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close