‘మ‌నం’ ఫార్ములాలో రాజ‌శేఖ‌ర్ సినిమా

అక్కినేని కుటుంబం అంతా ఒకే సినిమాలో క‌ల‌సి సంద‌డి చేశారు. అదే… ‘మ‌నం’. ఏఎన్నార్ ఆఖ‌రి చిత్రం కూడా అదే కావ‌డంతో ఈ సినిమా ప్ర‌త్యేకంగా నిలిచిపోయింది. ఇలా కుటుంబ స‌భ్యులంతా క‌ల‌సి ఓ సినిమాలో న‌టించ‌డం అరుదైన విష‌యంగా రికార్డుకెక్కింది. ఇప్ప‌డు రాజ‌శేఖ‌ర్‌కీ అదే ఆలోచ‌న వ‌చ్చింది. జీవిత‌, రాజ‌శేఖ‌ర్ ఇద్ద‌రూ న‌టులే. ఇద్ద‌రూ జంట‌గా ఎన్నో సినిమాల్లో న‌టించాడు. ఆ త‌ర‌వాత‌.. జీవిత సినిమాల‌కు దూర‌మైంది. రాజ‌శేఖ‌ర్ మాత్రం హీరోగా కొన‌సాగుతున్నారు. ఇప్పుడు ఈ ఇంట్లోంచి ఇద్ద‌రు హీరోయిన్లు వ‌చ్చారు. వాళ్లే శివానీ, శివాత్మిక‌. ఇప్పుడు ఈ న‌లుగురూ క‌ల‌సి ఓ సినిమాలో న‌టించ‌బోతున్నారు. క‌థ కూడా సిద్ధ‌మైంది. సి.క‌ల్యాణ్ ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌న్న‌ది త్వ‌ర‌లో తెలుస్తోంది. ఇటీవ‌లే రాజ‌శేఖ‌ర్ న‌టించిన ‘క‌ల్కి’ విడుద‌లైంది. ప్ర‌స్తుతం `గ‌రుడ‌వేగ 2` సినిమాని ప‌ట్టాలెక్కించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. త్వ‌ర‌లోనే రాజ‌శేఖ‌ర్ ‘మ‌నం’ కార్య‌రూపం దాల్చే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

HOT NEWS

css.php
[X] Close
[X] Close