రేవంత్ లెక్కలో కొత్త సచివాలయం ఖర్చు రూ. 2వేల కోట్లు..!

తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీలను కట్టాలని నిర్ణయించుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పు పడుతోంది. అసలు ఇప్పుడు.. కొత్త భవనాలు నిర్మించాల్సిన అవసరం ఏమిటన్న లాజిక్ తీసుకు వస్తోంది. అసెంబ్లీ భవనం బాగోలేదా… ? సచివాలయం బాగోలేదా..? అని ప్రశ్నిస్తున్నారు. వీటికి మించి.. బేషుగ్గా ఉన్న.. పాత సచివాలయాన్ని.. కూలగొట్టేసి.. కొత్తది నిర్మించడమేమిటని వారు పోరుబాట పట్టారు. కూల్చివేతలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని సవాల్ చేస్తున్నారు. న్యాయపోరాటం కూడా ప్రారంభించారు. అయితే.. తెలంగాణ సీఎం కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు కాబట్టి.. తాము కూడా ఏమీ చేయలేమని వీహెచ్ లాంటి కాంగ్రెస్ నేతలు గాలి తీసేస్తూ ఉంటారు. కానీ రేవంత్ మాత్రం.. ఈ విషయాన్ని చాలా లాజికల్ పాయింట్లతో.. రాజకీయం చేయడానికి.. తీవ్రంగా ప్రయత్నిస్తూంటారు. సచివాలయం ఖర్చువిషయంలో ఆయన ప్రజల ముందుంచుతున్న వాదన.. ఆసక్తికరంగా ఉంది.

తెలంగాణ సీఎం కేసీఆర్ మొదట ఏదైనా.. చాలా పరిమితంగానే చెబుతారని.. తర్వాత అంచనాలను పెంచేస్తారని.. ఉదాహరణలుగా రేవంత్ రెడ్డి చెబుతున్నారు. రూ. 20,000 కోట్ల అంచనాలతో మొదలు పెట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అంచనాలను కేసీఆర్ రూ.40 వేల కోట్లకు తీసుకెళ్లారు. రూ. 40,000 కోట్ల ఖర్చవుతుందని ప్రారంభించిన కాళేశ్వరం రూ.1.20 లక్షల కోట్లకు చేరుకునేలా చేశారని… ఈ లెక్కలో… ఇప్పుడు రూ. 400 కోట్లతో కడతామంటున్న సచివాలయం కూడా నిర్మాణం పూర్తయ్యే సరికి రూ.2,000 కోట్లకు చేరుకుంటుందని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. నిజానికి.. రూ. 400 కోట్లు మాత్రమే అని.. కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో చెప్పినప్పుడు.. అంత సింపుల్‌గా అయిపోతుందని ఎవరూ అనుకోలేదు. ఆ విషయాన్ని రేవంత్ లాజికల్‌గా చెప్పారు.

అసలు ఇప్పుడు ఉన్న సచివాలయాన్ని కూలగొట్టాల్సిన అవసరమే లేదనేది రేవంత్ వాదన. తెలంగాణ సచివాలయంలో ఉన్న ఏ భవనాన్ని కూడా 35 సంవత్సరాలకు మించి వినియోగించలేదని అంటున్నారు. ఏవైనా ప్రభుత్వ భవనాలు నిర్మించాలనుకుంటే..100 సంవత్సరాలు ఉపయోగపడేలా నిర్మిస్తారని గుర్తు చేస్తున్నారు. దీన్నే ప్రజల్లోకి చురుగ్గా తీసుకెళ్లి.. ప్రజాధనాన్ని కేసీఆర్ వృధా చేస్తున్నారని.. ప్రచారం చేయాలనకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close