వావ్.. రాయల్స్ దంచేశారు..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ప్రతీ ఆదివారం ఓ స్పెషల్‌గా మారుతోంది. గత వారం సూపర్ ఓవర్‌దాకా సాగిన మ్యాచ్ ఊపిరిబిగపట్టి చూసేలా చేయగా.. ఈ సారి రాజస్థాన్ రాయల్స్ అసలు అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని అంతే ట్విస్టులతో చేధించేసి..ఔరా అనిపించింది. ఈ మ్యాచ్‌లో ఇంకా మెరుపులు ఉన్నాయి. పంజాబ్ ప్లేయర్ నికోలస్ పూరన్ చేసిన ఓ ఫీల్డింగ్ విన్యాసం చూస్తే జాంటీరోడ్స్ ముత్తాత అని అనుకోక తప్పదు.

షార్జా ఒకప్పుడు క్రికెట్ ప్రేమికుల స్వర్గధామం. అక్కడి స్టేడియం అందరికీ చిరపరిచితం. కానీ అక్కడ మ్యాచ్‌లు జరగక ఏళ్లు దాటిపోయింది. ఇప్పుడు కరోనా పుణ్యామాని ఐపీఎల్‌కు ఆతిధ్యం ఇచ్చే జాబితాలో చేరింది. ఆ షార్జా స్టేడియంలోనే… ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక రన్ చేజింగ్ మ్యాచ్ జరిగింది. పంజాబ్- రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 224 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ ముందు ఉంచింది. ఇది భారీ స్కోరే కానీ.. అత్యధిక స్కోర్ కాదు. కానీ ఇంత స్కోరు చేసిన జట్టు ఏదీ ఐపీఎల్‌లో ఓడిపోలేదు. మాయంక్ అగర్వాల్ సెంచరీ చేశారు. కేఎల్ రాహుల్ కూడా బాదేశాడు. దీంతో.. ఇక పంజాబ్‌దే జోరు అనుకున్నారు. చిరునవ్వుతో వెళ్తున్నా అని సందేశం ఇచ్చిన పంజాబ్ జట్టు కో ఓనర్ ప్రీజింతాకు… ఆ చిరునవ్వు మిగిలిస్తారని అందరూ అనుకున్నారు.

కానీ ఇక్కడ ఒక్కటే రాజస్థాన్‌కు ప్లస్ పాయింట్ ఉంది. ఇప్పటి వరకూ అత్యధిక పరుగుల చేజింగ్ రికార్డు రాయల్స్ పేరుమీదనే ఉంది. దాంతో.. ఈ సారి కూడా అద్భుతం ఏమైనా జరుగుతుందా అని అనుకున్నారు. కానీ అలాంటి చాన్స్ లేదని.. మొదటి పది ఓవర్లకు రియలైజ్ అయ్యారు చాలా మంది ఫ్యాన్స్. ఎదుకంటే ఇన్నింగ్స్ చేజింగ్‌కు తగ్గ వేగంతో నడవలేదు. చివరి నాలుగు ఓవర్లలో 63 పరుగులు చేస్తేనే గెలుస్తారన్న గణాంకాలు వచ్చేటప్పటికీ ఎవరికీ అశల్లేవు. ఎందుకంటే.. అప్పటి వరకూ క్రీజ్‌లో ఉన్న తెవాతియా .. సాదాసీదాగా అడుతూ వచ్చాడు. కానీ అప్పటి నుండి పూనకం వచ్చినట్లుగా ఊగిపోయాడు. 18 ఓవర్ల వరుసగా ఐదు సిక్స్‌లు బాదేసి.. ఐపీఎల్‌లో ఏపీ అసాధ్యం కాదని నిరూపించాడు. దీంతో మూడు బంతులు మిగిలి ఉండగానే రాజస్థాన్ గెలిచేసింది. భారీ స్కోరు చేసిన విజయం దక్కనందుకు ప్రీతిజింటాకు చిరునవ్వు మాయమైంది.

అయితే ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ అద్భుతాలు చోటు చేసుకున్నాయి. పంజాబ్ ఆటగాడు నికోలస్ పూరన్ బౌండరి లైన్ అవతల పడిన బంతిని డైవింగ్ చేసి పట్టుకున్నాడు. తాను కింద పడుతున్నానని తెలిసి లోపలికి విసిరేశాడు. కానీ అలా విసిరేసిన సమయం భూమికి.. పూరన్ ఎంత దగ్గరగా ఉన్నాడో… ప్రత్యక్షంగా చూస్తేనే.. ఆ విన్యాసంలో ఉన్న గొప్పతనం తెలుస్తుంది. మొత్తానిగి మరో ఆదివారం .. ఐపీఎల్ ఫ్యాన్స్‌కు అద్భుతమైన అనుభవం అందించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close