రెండో స్థానానికి పడిపోయిన టీవీ9, అంతర్మధనం

పదహారేళ్లుగా మొదటి స్థానంలో అప్రతిహతంగా కొనసాగుతున్న టీవీ9 రెండో స్థానానికి పడిపోయింది. మొన్నటికి మొన్న లాక్ డౌన్ సమయంలో టిఆర్పి రేటింగులో తాము మొదటి స్థానంలో ఉన్నామని, రెండవ స్థానంలో ఉన్న ఛానల్ తమకు కనీసం దరిదాపుల్లో కూడా లేదని బీరాలు పలికిన టీవీ9 అతికొద్ది వారాల్లోనే రెండో స్థానానికి పడిపోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే ఈ విషయంలో అంతర్గతంగా ఛానల్ లో కూడా విశ్లేషణలు , అంతర్మధనం జరుగుతున్నట్లు సమాచారం. అయితే టీవీ9 లో జరుగుతున్న అంతర్మధనం ఎలా ఉన్నప్పటికీ ప్రజల లో మాత్రం టీవీ9 రెండో స్థానానికి పడిపోడానికి వినిపిస్తున్న కొన్ని కారణాలు ఇలా ఉన్నాయి.

మొదటి స్థానం లోకి వచ్చిన ఎన్టీవీ, రెండో స్థానానికి పడిపోయిన టీవీ9:

రెండు మూడు నెలల క్రితమే టీవీ9 తామే నెంబర్ వన్ అని, రెండో స్థానంలో ఉన్న ఛానల్ తమకు దరిదాపుల్లో కూడా లేదని ప్రగల్భాలు పలికింది. అయితే గతవారం రేటింగ్లో చాలా సంవత్సరాల తర్వాత టీవీ9 రెండవ స్థానానికి నెట్టేసి ఎన్ టివి మొదటి స్థానంలో నిలిచింది. టీవీ9 తో పోలిస్తే క్వాలిటీ పరంగా ఎన్ టివి సరితూగక పోయినప్పటికీ టీవీ9 స్థాయిలో విస్తృతమైన ప్రోగ్రామ్స్ ఇందులో లేకపోయినప్పటికీ టీవీ9 ఛానల్ ని ఎన్ టివి కిందకు నెట్టివేయడం ఆశ్చర్యం కలిగించే విషయం.

అధికార పార్టీలకి టీవీ9 దాసోహం అయిందా?

మీడియా అన్నది ప్రజల పక్షాన ఉండాలన్నది ప్రజల భావన. టీవీ9 మొదట్లో ఇలాగే ఉన్నప్పటికీ, రానురాను అధికార పార్టీలకు పూర్తిగా అనుకూలంగా మారిపోయింది అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీలకు సంబంధించిన వారు చేసే పొరపాట్లు, ఆగడాలకు సంబంధించిన అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వచ్చిన ఎన్నో గంటల తర్వాత కానీ టీవీ9 లో రావడం లేదు. అది కూడా టీవీ9 లో వచ్చే సమయానికి అధికార పార్టీకి చెందిన వారి వివరణలతో సహా వస్తోంది. ఇది ప్రజలలో టీవీ9 మీద తేలికపాటి అభిప్రాయం ఏర్పడడానికి కారణం అవుతుంది. ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్ లోనూ అధికార పార్టీని సవాల్ చేసే లాగా గత పదేళ్ళలో టీవీ9 ఒక వార్త కూడా ఇవ్వలేదు అంటే అది అతిశయోక్తి కాదు. రేవంత్ రెడ్డి , బండి సంజయ్, పవన్ కళ్యాణ్ వంటి నేతలు చేసే కార్యక్రమాలకు కనీస స్క్రోలింగ్ కూడా టీవీ9 ఇవ్వదని, గల్లీ స్థాయి టిఆర్ఎస్ నాయకులు, అధికార వైఎస్ఆర్సిపి లోని చోటామోటా నాయకులు చేసే వ్యాఖ్యలకు మాత్రం తాటికాయంత అక్షరాలతో స్క్రోలింగ్ ఇస్తుందని సోషల్ మీడియాలో ఆ చానల్ పై దుమ్మెత్తి పోస్తూ ఉంటారు ఆ నాయకులు అభిమానులు.

తెలంగాణలో టీవీ9 ని భారీగా దెబ్బతీసిన వీ6, దానికి విరుగుడు ప్రయత్నం బెడిసి కొట్టడం:

టీవీ9 మై హోమ్ రామేశ్వరరావు చేతిలోకి వెళ్లిన తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీకి ఛానల్ పూర్తిగా అనుకూలం గా మారిపోయింది అన్న అభిప్రాయం వినిపించింది. అదే సమయంలో తెలంగాణ ప్రాంతంలో v6 ఛానల్ కాస్త తటస్థంగా ఉన్నట్లు కనిపించడం, రూరల్ తెలంగాణ పల్స్ పట్టుకునేలా ఆ చానెల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం కారణంగా హైదరాబాదేతర తెలంగాణలో చాలాకాలంగా టీవీ9 రెండవ స్థానానికి నెట్టేసి వి6 ఆదిపత్యాన్ని కొనసాగిస్తోంది. అయితే కేవలం తెలంగాణ ప్రాంతంలో మాత్రమే ప్రేక్షకాదరణ కలిగిన వి6 ఛానల్ ని ఎదుర్కోవడం కోసం, టీవీ9 చేసిన ప్రయత్నాలు అటు ఆంధ్రప్రదేశ్లో టీవీ9 దెబ్బ కొట్టాయి అన్న అభిప్రాయం వినిపిస్తోంది.

రేటింగులు ఇప్పుడే పడిపోయాయా? లేక గతంలో మేనిప్యులేట్ చేసి నిలబెట్టుకున్నారా?

అయితే టీవీ9 రేటింగులు ఇప్పుడు కొత్తగా పడిపోలేదని, 2-3 ఏళ్ల కిందటే అది మొదలైందని, అయితే టిఆర్ పీ లను తారుమారు చేసి టీవీ9 ఇంతకాలం ప్రచారం చేసుకుంటోందని అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఇటీవల రజత్ శర్మ టీవీ9 చేస్తున్న ఈ తారుమారు వ్యవహారాల గురించి బార్క్ కి రాసిన లేఖ మీడియా వర్గాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రవి ప్రకాష్ హయాంలోనూ టీవీ9 రేటింగులు పడిపోయాయని, అయితే అప్పుడు అవి తారుమారు చేసి ప్రకటించుకున్నారు అని విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకి టీవీ9 లో విపరీతంగా ప్రచారం కాబడ్డ ఆపరేషన్ గరుడ ని ప్రజలు నమ్మలేదు అన్న విషయం ఎన్నికల్లో తేటతెల్లమైంది. అంటే ప్రజలు నమ్మని విషయాన్ని, నమ్మరు అని తెలిసి కూడా నెలల తరబడి టీవీ9 ప్రచారం చేసింది అన్నమాట. అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద ఏకపక్షంగా చేసిన రాజకీయ దాడి కూడా ఛానల్ మీద తీవ్ర వ్యతిరేకత తీసుకువచ్చింది. 2018 ఏప్రిల్ లో పవన్ కళ్యాణ్ తో టీవీ9 ఉద్దేశపూర్వకంగా రాజకీయ దాడి చేస్తోంది అన్న ఉద్దేశంతో, లక్షలాది మంది అభిమానులు టీవీ9 యాప్ ని తమ మొబైల్స్ నుంచి తొలగించుకున్నారు, ఆ చానల్ చూడడం మానేశారు, అయినప్పటికీ అప్పట్లో టీవీ9 టాప్ రేటింగ్ లో ఉండడం కలిగించిన అనుమానాలను ఇప్పుడు రజత్ శర్మ రాసిన లేఖ, తదనంతర పరిణామాలు బలపరుస్తున్నాయి.

ఏది ఏమైనా టీవీ9 ఛానల్ ప్రేక్షకాదరణను కోల్పోతుంది అన్న మాట వాస్తవం. అది వేరే ఒక ఛానల్ కు వెళ్తుందా లేక సోషల్ మీడియా కు వెళ్తుందా అన్నది వేరే టాపిక్. మరి తన పంథాను మార్చుకుని టీవీ9 మళ్లీ మొదటి స్థానం నిలబెట్టుకుందా అన్నది వేచి చూడాలి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కన్నీటితో భువనేశ్వరి కాళ్లు కడుగుతామన్న వైసీపీ ఎమ్మెల్యే

నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారాన్ని ముగించాలని వైసీపీ నేతలు బతిమాలుతున్నారు. వల్లభనేని వంశీ మీడియా చానళ్లను పిలిచి ప్రతి ఒక్క చానల్‌కు విడివిడిగా ఇంటర్యూలు ఇచ్చి క్షమాపణలు చెప్పారు....

కాంగ్రెస్‌పై ప్రశాంత్ కిషోర్‌కు అంత కసి ఎందుకు !?

కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై ఎన్నికలకు వెళితేనే బీజేపీని ఎదుర్కోగలరు..లేకపోతే బీజేపీదే మళ్లీ అధికారం అని.. బెంగాల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ బహిరంగంగానే చెప్పారు. అంతే కాదు ఆయన...

ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన పటేల్…!

అజాజ్ పటేల్ ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ కుప్పకూలింది. కానీ ఆ పటేల్ కూడా న్యూజిలాండ్ ప్లేయరే. కివీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో...

రివ్యూ: స్కై లాబ్‌

తెలుగు360 రేటింగ్: 2.5/5 ఇప్ప‌టి ముచ్చ‌ట కాదు గానీ... 1979 నాటి మాట‌. అప్ప‌ట్లో స్కై లాబ్ గురించి వింత వింత పుకార్లు ప్ర‌చారంలోకొచ్చాయి. ఆకాశం నుంచి ఓ ఉల్క‌, ఉప‌గ్ర‌హ శ‌క‌లాలు భూమిపై...

HOT NEWS

[X] Close
[X] Close