మధ్యప్రదేశ్ సీన్ రాజస్థాన్‌లోనూ రిపీట్ అవుతోందా..?

జ్యోతిరాదిత్య సింధియా తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరిపోవడంతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి… బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత… పట్టుమని ఏడాది కూడా ఉండలేకపోయింది. ఇప్పుడు అదే పరిస్థితి రాజస్థాన్ ప్రభుత్వానికి వచ్చే ప్రమాదం ఏర్పడింది. జ్యోతిరాదిత్య లానే… రాజస్థాన్ యువ నేత సచిన్ పైలట్.. తన వర్గం ఎమ్మెల్యేలతో వేరు కుంపటి పెట్టుకునే ఆలోచన చేస్తున్నారు. తన వర్గానికి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని ఆయన నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. కొద్ది రోజులుగా… రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తన ప్రాధాన్యం తగ్గించే పని చేస్తున్నారని .. సచిన్ పైలట్ కినుక వహిస్తున్నారు. ఈయన కాంగ్రెస్ సీనియర్ నేత రాజేష్ పైలట్ కుమారుడు. రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా పేరు ఉంది.

మూడు రోజుల కిందట… ఒక్కో ఎమ్మెల్యేకు పాతిక కోట్లు ఆఫర్ చేస్తున్నారంటూ.. ఇద్దరు వ్యక్తుల్ని రాజస్థాన్ పోలీసులు పట్టుకున్నారు. వారు ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర పన్నారని.. కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆ ప్రయత్నాల వెనుక బీజేపీ ఉందని… మండిపడుతుతున్నారు. ఆ విషయంలో వాంగ్మూలం ఇవ్వడానికి సచిన్ పైలట్‌కు కూడా.. పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ లోపే ఆయన.. తన వర్గం ఎమ్మెల్యేలను తీసుకుని ఢిల్లీకి చేరుకున్నారు. అయితే బీజేపీ మాత్రం.. చాలా కామ్‌గా ఉంది. అది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారం అని.. తమకు ఏమీ సంబంధం లేదని చెబుతూ వస్తోంది.

సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించింది. చత్తీస్‌ఘడ్‌లో బంపర్ మెజార్టీతో.. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఓ మాదిరి మెజార్టీతో అధికారాన్ని దక్కించుకుంది. మధ్యప్రదేశ్‌లో ఓ రకంగా మైనార్టీ ప్రభుత్వమే ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ సీఎం పదవికి… జ్యోతిరాధిత్య, సచిన్ పైలట్ పోటీ పడ్డారు. వారిని కాదని.. సీనియర్లకు చాన్సిచ్చారు రాహుల్ గాంధీ. ఫలితంగా సమయం చూసి.. బీజేపీ వారిని తమ వైపు లాగేసుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close