లాక్‌డౌన్ దిశగా రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనలు..!

వైరస్ దెబ్బకు మళ్లీ షట్‌డౌన్ ఆలోచనలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో వారం పాటు కంప్లీట్ లాక్ డౌన్ ప్రకటించేసింది. అక్కడ ఇప్పటికే వారంతాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. అయినా.. అనూహ్యంగా.. రోజు రోజుకు రికార్డు స్థాయి కేసులు నమోదవుతూండటంతో… కంప్లీట్ లాక్ డౌన్ వైపు కర్ణాటక ఆలోచనలు చేసింది. బెంగళూరులో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. మరింత పెరగకుండా ఉండాలంటే.. జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే తమిళనాడు.. ఆంధ్రప్రదేశ్ కూడా.. భారీగా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో కట్టడి చర్యలను ప్రకటించాయి. లాక్ డౌన్‌ను పాక్షికంగా అమలు చేస్తున్నాయి.

ఉత్తరాది ప్రభుత్వాలు కూడా అదే పని చేస్తున్నాయి. నిజానికి బెంగాల్, పంజాబ్, అసోం లాంటి రాష్ట్రాలు… కేంద్రం ఇస్తున్న అన్‌లాక్ నిబంధనల సడలింపులను పట్టించుకోకుండా.., సొంతంగా ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఫలితంగా కొన్ని చోట్ల.. కరోనా వైరస్ కట్టడి అవుతోంది కూడా. కానీ.. ఆర్థిక వ్యవస్ధ కుంగిపోతోందంటూ… కేంద్రం ఇచ్చిన రిలాక్సేషన్స్‌ను యథావిధిగా అమలు చేస్తున్న రాష్ట్రాల్లో మాత్రం.. పరిస్థితి దిగజారిపోతోంది. కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ.., రోజుకు .. రెండు వేల కేసులు నమోదయ్యే పరిస్థితి వచ్చింది.

కేంద్ర ప్రభుత్వం మాత్రం.. అన్ లాక్ సీజన్ ను కొనసాగించాలని నిర్ణయించుకుంది. కొత్తగా భారీగా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో.. ఆయా రాష్ట్రాలు సొంతంగా ఆంక్షలు విధించుకోవచ్చని స్పష్టం చేసింది. ఆ ప్రకారం.. రాష్ట్రాలదే నిర్ణయం అయిపోయింది. ప్రజారోగ్యంపై.. ఎక్కువ దృష్టి పెట్టిన ప్రభుత్వాలు.. కట్టడి చర్యలపైనా ఆలోచనలు చేస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ.. ఆదాయంపై దృష్టి పెట్టిన ప్రభుత్వాలు… మొత్తం లైట్ తీసుకుంటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రఘురామకృష్ణరాజుకు వై కేటగిరీ సెక్యూరిటీ..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు కేంద్ర బలగాలు రక్షణ కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనకు వై కేటగిరి సెక్యూరిటీ కల్పించినట్లుగా సమాచారం అందిందని.. అధికారిక ఆదేశాలు ఒకటి రెండు రోజుల్లో వస్తాయని రఘురామకృష్ణరాజు మీడియాకు...

దళిత నేతలతోనే న్యాయస్థానాలపై వివాదాస్పద వ్యాఖ్యలు..! వైసీపీ స్ట్రాటజీ ఏంటి..?

వైసీపీ రాజకీయ వ్యూహం.. న్యాయవ్యవస్థపై సామాజిక పద్దతుల్లో అమలు చేస్తున్నారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా.. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని... దళితుల్ని అడ్డు పెట్టుకుని.. న్యాయవ్యవస్థపై విమర్శలు చేసి.. ఒత్తిడి పెంచే...

రామాలయ భూమిపూజ లైవ్ ఇవ్వని ఎస్వీబీసీ..! బీజేపీ విమర్శలు..!

అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ చూసేలా.. ఏర్పాట్లు చేశారు. చివరికి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లోనూ... ప్రసారం చేశారు. అయితే.. అనూహ్యంగా... తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి...

భార‌తీరాజా సీక్వెల్‌లో.. కీర్తి సురేష్‌?

భార‌తీరాజా ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `ఎర్ర‌గులాబీలు` సూప‌ర్ హిట్ అయ్యింది. ఇళ‌య‌రాజా సంగీతం, శ్రీ‌దేవి గ్లామ‌ర్‌, క‌మ‌ల్ న‌ట‌న‌.. ఇవ‌న్నీ ఈ చిత్రాన్ని ప్ర‌త్యేకంగా నిల‌బెట్టాయి. ఈ సినిమా వ‌చ్చి దాదాపు 40...

HOT NEWS

[X] Close
[X] Close