రజనీకాంత్ డిశ్చార్జ్..! పార్టీ ప్రకటన ఆలస్యం..!?

సూపర్ స్టార్ రజనీకాంత్.. అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మూడు రోజుల కిందట ఆయనకు అనూహ్యంగా బ్లడ్ ప్రెషర్ పెరగడంతో అపోలో ఆస్పత్రిలో జాయినయ్యారు. చికిత్స తర్వాత పూర్తిగా కోలుకున్నప్పటికీ.. రజనీ గత అనారోగ్యాల దృష్ట్యా.. మరికొన్ని కీలక పరీక్షలు నిర్వహించాలని అపోలో వైద్యులు నిర్ణయించారు. ఈ కారణంగా మూడు రోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సి వచ్చింది. చివరికి అన్ని రిపోర్టులు సక్రమంగానే ఉన్నాయని తేలడంతో.. ఈ మధ్యాహ్నం డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ తర్వాత కుమార్తె ఐశ్వర్యతో కలిసి ఆయన నేరుగా చెన్నై వెళ్లిపోయారు. వైద్యులు వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారు. ఎక్కువగా ఒత్తిడికి గురి కావొద్దని చెప్పారు.

వైద్యుల సలహాతో రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి డిసెంబర్ 31వ తేదీన నిర్వహించాలనుకున్న కార్యక్రమంపై ఉత్కంఠ ప్రారంభమయింది. చాలా రోజుల పాటు నాన్చి నాన్చి.. ఇటీవలే.. రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లుగా ప్రకటించారు. రాజకీయ పార్టీ పేరు.. గుర్తు.. ఇతర వివరాలన్నింటినీ ఆయన డిసెంబర్ 31న ప్రకటిస్తానని చెప్పారు. తమిళనాడు రాజకీయం మొత్తం ఇప్పుడు ఏడాది చివరి తేదీ వైపు చూస్తోంది. రజనీకాంత్ రాజకీయ ప్రకటన ఎలా ఉంటుందోనన్న ఆసక్తే దానికి కారణం. అయితే ఇప్పుడు రజనీ అనారోగ్యం కారణంగా ఆ కార్యక్రమం ఉంటుందా లేదా అన్నదానిపై సందేహాలు ప్రారంభమయ్యాయి.

రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి చాలా రోజుల నుంచి ఏమంత గొప్పగా లేదు. కరోనా కాలంలో ఆయన మరింత జాగ్రత్తగా ఉండాలని వ్యక్తిగత వైద్యులు సూచిస్తూ వస్తున్నారు. ఈ కారణంగానే ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఉండకపోచ్చని అనుకున్నారు. కానీ రజనీ మాత్రం ముందుకే వెళ్లాలని అనుకున్నారు. అయితే.. తాను చురుగ్గా ప్రచారం చేయలేనని… గెలిచినా ముఖ్యమంత్రి పదవిని కూడా యువకుడికి అప్పగిస్తానని చెబుతూ వస్తున్నారు. దానికి తన అనారోగ్యమే కారణమని అంటున్నారు. డిశ్చార్జ్‌కు ముందు రజనీకాంత్‌ను అపోలో ఆస్పత్రిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కలిశారు. ఏం చర్చించారో క్లారిటీ లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రంగీలాలో చిరు – ర‌జ‌నీ – శ్రీ‌దేవి..?

రంగీలా... రాంగోపాల్ వ‌ర్మ త‌డాఖాని బాలీవుడ్ కి రుచి చూపించిన సినిమా. ఊర్మిళ‌ని ఈ సినిమా సూప‌ర్ స్టార్ ని చేసింది. నిజానికి.. ఈ క‌థ చిరంజీవి, ర‌జ‌నీ కాంత్, శ్రీ‌దేవిల‌తో చేయాల్సింద‌ట‌....

‘స‌లార్’ రిలీజ్ డేట్ .. పెద్ద ప్లానే ఉంది!

పాన్ ఇండియా ప్రాజెక్టు స‌లార్ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది. 2023 సెప్టెంబ‌రు 28న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ఇది.. `రెబ‌ల్` రిలీజ్ డేట్. దాంతో ప్ర‌భాస్ అభిమానులు కంగారు ప‌డుతున్నారు.కాక‌పోతే... ఈ...

ఆ ఇద్ద‌ర్నీ గీతా ఆర్ట్స్ భ‌లే ప‌ట్టేసింది

సినిమా విడుద‌ల అయ్యాక, రిజ‌ల్ట్ ని బ‌ట్టి ద‌ర్శ‌కుడి చేతిలో అడ్వాన్సులు పెట్ట‌డం స‌ర్వ సాధార‌ణ‌మైన సంగ‌తే. ఏ సినిమా హిట్ట‌వుతుందా? అని నిర్మాత‌లు ఆశ‌గా ఎదురు చూస్తుంటారు. అయితే.. విడుద‌ల‌కు...

‘బింబిసార 2’లో… దిల్ రాజు హ్యాండ్‌

ఎవ‌రూ ఊహించ‌లేనంత పెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసింది బింబిసార‌. క‌ల్యాణ్ రామ్ కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ హిట్. ఇప్పుడు అంద‌రి దృష్టీ పార్ట్ 2పై ఉంది. బింబిసార విజ‌యంతో.. పార్ట్ 2పై న‌మ్మ‌కాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close