రజనీకాంత్ కూడా విభజన రాజకీయం నేర్చుకున్నారా..?

తమిళనాడు రాజకీయం మొత్తం పెరియార్ భావజాలంతో నిండి ఉంటుంది. డీఎంకే, అన్నాడీఎంకే రెండూ.. పెరియార్ భావజాలంతో ఉన్నవే. ఇప్పుడు.. రజనీకాంత్.. రాజకీయాల్లో స్పేస్ కోసం.. భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది. పెరియార్‌ను వ్యతిరేకిస్తూ.. ఆయన రాజకీయంగా తనదైన ముద్ర వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. పెరియార్ భావజాలంలో దేవుళ్లకు చోటు లేదు. యాభై, అరవై ఏళ్ల కిందట.. తమిళనాడులో జరిగిన ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. మూఢనమ్మకాలు, దేవుళ్లకు వ్యతిరేకంగా ఉద్యమమే నడిచింది. పెరియార్‌ దీనికి నేతృత్వం వహించారు. అప్పట్లో పెరియార్‌ను.. నూతన శతానికి ప్రవక్తగా యునెస్కో ప్రశంసించింది మూఢ నమ్మకాలకు ఆయన వ్యతిరేకం అర్థం లేని సంప్రదాయాలను ఆయన తిరస్కరించారు.

అయితే ఇప్పుడు జనరేషన్లు మారిపోయాయి. పెరియార్ భావజాలంతో ఏర్పడిన పార్టీలు కూడా.. అభిప్రాయాల్ని మార్చుకోకపోయినా… అములలో మాత్రం ఫ్లెక్సిబులిటీ చూసుకుంటున్నాయి. దేవుళ్లను అప్పట్లా వ్యతిరేకించడం లేదు. కానీ బహిరంగంగా చెప్పలేరు. ఈ పరిస్థితి రజనీకాంత్ ఉపయోగించుకుటున్నట్లుగా కనిపిస్తోంది. గత వారం.. ఆయన పెరియార్.. దేవుళ్ల విగ్రహాలకు చెప్పుల దండ వేసి ఊరేగించారని.. ప్రకటించారు. అది వివాదాస్పదమయింది. ఆయనపై కేసులు నమోదైనా.. వెనక్కి తగ్గేది లేదని ప్రకటించారు. ఆ తర్వాత తమిళనాడులో పరిస్థితులు మారుతున్నాయి. అక్కడక్కడా పెరియార్ విగ్రహాలపై దాడుు జరుగుతున్నాయి.

రజనీకాంత్.. ఆస్తికులను రెచ్చగొట్టి ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే ఆయన ఈ తేనెతుట్టెను కదిలించారని తమిళనాడు రాజకీయవర్గాలు అంచనాకు వస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు ఒకటి రెండు కొనసాగితే మాత్రం ఆస్తికులు, నాస్తికుల మధ్య ఉద్రిక్తతలు పెరిగే పరిస్థితి ఉందని.. ఇది రాజకీయ అంశంగా మారుతుందన్న అంచనాలున్నాయి. అదే జరిగితే.. ఓ వర్గానికి రజనీకాంత్ నాయకుడైపోతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close