కమల్ హాసన్, రజనీకాంత్ కలయికలో ఒక సినిమా వస్తుందని ప్రచారం జరిగింది. దీనికి మణిరత్నం డైరెక్టరని కథనాలు వెలువడ్డాయి. ఇప్పుడీ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ ఈక్వేషన్ మారింది. ఈ సినిమాకి కమల్ నిర్మాత. రజనీ హీరో. డైరెక్షన్ సుందర్.సి కి అప్పగించారు.
కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. కమల్ రజనీ మధ్య ఐదు దశాబ్దాల స్నేహం వుంది. ఈ ఇద్దరని బిగ్ స్క్రీన్ పై చూడాలని చాలామంది ఫ్యాన్స్ కోరిక. అయితే ఈసారి కమల్ కేవలం నిర్మాత చైర్ కే పరిమితం అయ్యారు.
ఈ సినిమా డైరెక్షన్ సుందర్ కి ఇవ్వడం కూడా సర్ ప్రైజ్. సుందర్ మంచి డైరెక్టర్. రజనీకి అరుణాచలం లాంటి హిట్ సినిమా ఇచ్చాడు. కానీ ఆయన ట్రెండ్ నుంచి చాలా కాలంగా దూరం జరిగాడు. ఇప్పుడు అరణ్మనై సిరిస్ లోనే సినిమాలు చేస్తున్నాడు. రజనీ సినిమా అంటే ఇప్పుడు అంచనాలు వేరు. ఇది ఎలాంటి బజ్ క్రియేట్ చేసే సినిమా అవుతుందా అనేది ప్రశ్న. 2027 సంక్రాంతికి సినిమా రిలీజ్ అనుకుంటున్నారు.