రజనీకాంత్‌కి ప్రత్యేక అధికారాలు?

రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న 165వ చిత్రానికి ‘పేట్ట’ అనే టైటిల్‌ ఖరారు చేసినట్టు శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. ‘పిజ్జా’ ఫేమ్‌ కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీ అల్లుడు ధనుష్‌ నిర్మిస్తున్న సినిమా ఇదే! సినిమా మోషన్‌ పోస్టర్‌లో టైటిల్‌తో పాటు తలైవా లుక్‌ని చూపించారు. అంత వరకూ బావుంది. కానీ, అసలు చిక్కంతా టైటిల్‌తోనే వచ్చింది. ‘పేట్ట’కి అర్థం ఏమై వుంటుందని తమిళ జనాలు చర్చించుకోవడం విశేషం. తమిళ టైటిల్‌ కనుక తెలుగువాళ్లకు అర్థం కాలేదంటే ఓ అర్థం వుంటుంది. కానీ, తమిళులకూ టైటిల్‌కి అర్థం ఏంటో అర్థం కాకపోవడమే విచిత్రం! తెలుగులో పల్లెటూళ్లలో నాయుడోరి పేట, హరిజనుల పేట… ఇలా అంటుంటారు కదా! తెలుగులో ‘పేట’ని తమిళంలో ‘పేట్ట’ అంటార్ట! అలాగే, ద్రవిడ భాషలో ‘పేట్ట’ అంటే ‘ప్రత్యేక అధికారం’ అనే అర్థం వుంది! రజనీకాంత్‌ చిత్రానికి ‘పేట’ అనే అర్థంలో పెట్టారా? లేదా రాజకీయాల్లోకి వస్తున్న తరుణంలో ‘ప్రత్యేక అధికారం’ అనే కాన్సెప్ట్‌ మీద టైటిల్‌ పెట్టారా? అని తమిళనాట చర్చించుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే… రజనీ లుక్‌, మోషన్‌ పోస్టర్‌లో అనిరుధ్‌ రవిచంద్రన్‌ నేపథ్య సంగీతం అభిమానులకు ఆకట్టుకుంటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండ‌లు పెంచుతున్న‌ నాగ‌శౌర్య

ల‌వర్ బోయ్ పాత్ర‌ల‌కు అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతాడు నాగశౌర్య‌. త‌న కెరీర్‌లో అలాంటి క‌థ‌లే ఎక్కువ విజ‌యాల్ని అందించాయి. అయితే... మాస్ హీరోగా నిరూపించుకోవాల‌న్న‌ది నాగ‌శౌర్య తాప‌త్ర‌యం. అలాంటి క‌థ‌లు ఎంచుకుంటున్నా - స‌రైన...

‘పుష్ష‌’‌పై విజ‌య్‌ సేతుప‌తి క్లారిటీ

అల్లు అర్జున్ - సుకుమార్‌ల హ్యాట్రిక్ సినిమా 'పుష్ష‌'. ఈ సినిమా కోసం విజ‌య్ సేతుప‌తిని విల‌న్ గా ఎంచుకున్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల విజ‌య్ ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నాడు. ఆ...

వ‌ర్మ‌ని లైట్ తీసుకున్నాడా?

రాంగోపాల్ వ‌ర్మ పేల్చ‌బోతున్న బాంబు `ప‌వ‌ర్ స్టార్‌`. ఓటీటీ వేదిక‌గా వ‌ర్మ ఇది వ‌ర‌కు ప‌లు సినిమాల్ని వ‌దిలాడు. దేనికీ రాని క్రేజు.. `ప‌వ‌ర్ స్టార్‌`కి వ‌చ్చింది. ఈ సినిమా స్పెషాలిటీ గురించి...

రాజకీయాల్లో రాజస్థాన్ “సచిన్” హిట్ వికెట్ ..!?

రాజస్థాన్ ప్రభుత్వాన్ని మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కూల్చేసినట్లుగా కూల్చేస్తారని భావించిన సచిన్ పైలట్.. చివరికి.. హిట్ వికెట్‌గా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తన వైపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఆయన తనకు...

HOT NEWS

[X] Close
[X] Close