క‌మ‌ల్ సినిమాలో ర‌జ‌నీకాంత్‌?

నాయ‌కుడు త‌ర‌వాత మ‌ణిర‌త్నం – క‌మ‌ల్ హాస‌న్ కాంబో సెట్ట‌య్యింది. `పొన్నియ‌న్ సెల్వ‌న్‌` త‌ర‌వాత.. మ‌ణిర‌త్నం చేస్తున్న సినిమా ఇదే. త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభం కాబోతోంది. అయితే ఈ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ తో పాటుగా చాలామంది స్టార్లు క‌నిపించే అవ‌కాశాలు ఉన్న‌ట్టు టాక్‌. ముఖ్యంగా ర‌జ‌నీకాంత్ సైతం ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. విక్ర‌మ్‌, సూర్య‌, కార్తి గెస్ట్ రోల్స్ లో క‌నిపించే అవ‌కాశాలు ఉన్నాయి. మ‌ణిర‌త్నం వృద్దాప్యంలో ప‌డ్డారు. ఆయ‌న ఆరోగ్యం కూడా పెద్ద‌గా స‌హ‌క‌రించ‌డం లేదు. పైగా ఆమ‌ధ్య గుండె పోటుకు గుర‌య్యారు. పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమానే చాలా క‌ష్ట‌ప‌డి పూర్తి చేశారు. క‌మ‌ల్ హాస‌న్ తో సినిమా పూర్తి చేసి, మ‌ణిర‌త్నం సినిమాల‌కు గుడ్ బై చెబుతార‌ని ఇప్ప‌టికే కోలీవుడ్ లో ఓ టాక్ వినిపిస్తోంది. అందుకే క‌మ‌ల్ చిత్రాన్ని మ‌ర‌పురాని మైలురాయిగా మ‌ల‌చాల‌ని మ‌ణిర‌త్నం భావిస్తున్నార్ట‌. మ‌ణిర‌త్నం అడిగితే.. కోలీవుడ్ లో ఎంత పెద్ద స్టార్ అయినా స‌రే `ఓకే` అంటారు. అందుకే.. ఈ ప్రాజెక్టులోకి వాళ్లంద‌రినీ భాగ‌స్వాములుగా చేయాల‌ని మ‌ణిర‌త్నం భావిస్తున్నార్ట‌. ర‌జ‌నీ – క‌మ‌ల్ ఒకే తెర‌పై క‌నిపించి చాలా కాల‌మైంది. వాళ్లిద్ద‌రూ లేటెస్టుగా సూప‌ర్ హిట్లు ఇచ్చారు. ఇప్పుడు ఒకేసారి తెర‌పై క‌నిపిస్తే… ఇక చెప్పేదేముంది? కోలీవుడ్ లో కొత్త రికార్డుల‌కు బీజం ప‌డిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రూల్స్ రంజన్.. సూపర్ కాన్ఫిడెన్స్

ఈవారం వస్తున్న ప్రామెసింగ్ సినిమాల్లో కిరణ్ అబ్బవరం 'రూల్స్ రంజన్' ముందువరుసలో వుంది. కిరణ్ అబ్బవరం పక్కింటి కుర్రాడు ఇమేజ్ తో చేసిన సినిమాలు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. రూల్స్ రంజన్ ఆ...

సిద్దార్థ్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ !

సిద్ధార్థ్ కి సినిమాలు కలసిరావడం లేదు. ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఏదీ నిలబడటం లేదు,. హిట్టు అనే మాట రావడం లేదు. ఇటివలే టక్కర్ అనే సినిమా చేశాడు. సిద్ధార్థ్ పై...

లోకేష్‌పై అసలు ఎఫ్ఐఆర్లే లేవని చెబుతున్న సీఐడీ

లోకేష్ ను అరెస్టు చేయడం ఖాయమని ఊగిపోయిన సీఐడీ ఇప్పుడు ఆయన పేరు ఇంకా ఎఫ్ఐఆర్‌లో పెట్టలేదని చెబుతోంది. ఐఆర్ఆర్ కేసులో ఏ 14గా చేర్చి.. అరెస్ట్ చేస్తామన్నట్లుగా ఢిల్లీ వెళ్లి .....

హిందీలో మార్కులు కొట్టేసిన రవితేజ

రవితేజ చక్కని హిందీ మాట్లడతారు. ఆయన నార్త్ లో కొన్నాళ్ళు వుండటం వలన హిందీ అలవాటైయింది. ఇప్పుడీ భాష 'టైగర్ నాగేశ్వరరావు' కోసం పనికొచ్చింది. రవితేజ కెరీర్ లో చేస్తున్న మొదటి పాన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close