క‌బాలిపై కాపీ మ‌ర‌క‌

క‌బాలి… గ‌త నెల రోజుల నుంచీ ఈ పేరే ట్రేడింగ్‌! అంద‌రి నోటా క‌బాలీ మాటే. క‌బాలి పోస్ట‌ర్లు, పాట‌లు, డైలాగులు ఇవ‌న్నీ ర‌జ‌నీ ఫ్యాన్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. క‌బాలి గురించి ఏ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చినా అది హాట్ టాపిక్ అయి కూర్చుంటోంది. ఇప్పుడు క‌బాలి పోస్ట‌ర్ గురించి చ‌ర్చ జ‌రుగుతోంది. క‌బాలికి సంబంధించిన ఓ పోస్ట‌ర్‌పై కాపీ మ‌ర‌క ప‌డింది. ఇర్ఫాన్ ఖాన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఆదారి పోస్ట‌ర్‌ని క‌బాలి టీమ్ కాపీ కొట్టిన‌ట్టు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. దీనిపై ఇర్ఫాన్ ఖాన్ కూడా స్పందించాడు. ”మా పోస్ట‌ర్‌ని వాళ్లు స్ఫూర్తిగా తీసుకొని ఉండొచ్చు. అయితే అదేం పెద్ద మేట‌రేం కాదు. మా సినిమా చూడండి.. వాళ్ల సినిమా కూడా చూడండి..” అంటూ ఇర్ఫాన్ లైట్ తీసుకొన్నాడు. ఇర్ఫాన్‌ది పెద్ద మ‌న‌సే కావొచ్చు. కానీ సినీ విశ్లేష‌కులు మాత్రం.. పోస్ట‌ర్‌కి కూడా కాపీ కొట్టాలా?? అంటూ ద‌ర్శ‌కుడు రంజిత్ పాపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. పోస్ట‌రే ఇలా ఉంటే.. సినిమా మాటేంటి? అంటూ అప్పుడే నాన్ ర‌జ‌నీ ఫ్యాన్స్ క‌బాలిపై నెగిటీవ్ ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేస్తున్నారు. మ‌రి దీనిపై క‌బాలి టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చైనా ప్రొడక్ట్స్ బ్యాన్ చేద్దాం అన్న నాగబాబు, కౌంటర్ ఇచ్చిన నెటిజన్లు

భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు 1960వ దశకం నుండి ఉన్నాయి. అప్పుడప్పుడు హిందీ చీనీ భాయి భాయి అంటూ సత్సంబంధాలు నెరపడం, మళ్ళీ అప్పుడప్పుడు చైనా కయ్యానికి కాలు దువ్వడం దశాబ్దాలుగా జరుగుతోంది....

పరిహారం, పర్యావరణానికి ఎల్జీ పాలిమర్స్ కట్టిన రూ.50 కోట్లు ..!

ఎల్జీ పాలిమర్స్ సంస్థ కలెక్టర్ వద్ద డిపాజిట్ చేసిన యాభై కోట్ల రూపాయలను..పర్యావరణ పునరుద్ధరణ.. బాధితులకు పరిహారం కోసం వినియోగించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ స్పష్టమైన తీర్పును వెల్లడించింది. కేంద్ర పర్యావరణ...

మరో మూడు నెలలు సీఎస్‌గా సహాని..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానికి మరో మూడు నెలల పొడిగింపు లభించింది. మామూలుగా ఆమెకు జూన్ 30వ తేదీతో రిటైర్ కావాల్సి ఉంది. అయితే.. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి...

ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తానంటున్న ఆనం..!

ప్రజల కోసం ప్రభుత్వాన్ని... అధికారులను నిలదీయడానికి సిద్దమని ప్రకటించారు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి. అధికారులను సరే కానీ..ప్రభుత్వాన్ని నిలదీస్తామనే మాటే నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అంతటితో వదిలి...

HOT NEWS

[X] Close
[X] Close