వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు రాజీవ్ స్వగృహ ఇళ్లను ప్లాన్ చేశారు. మధ్య, దిగువ మధ్యతరగతి వారికి అమ్మేందుకు ఆ ఇళ్లను ప్లాన్ చేశారు. ఇప్పటికీ ఆ ఇళ్లను అమ్మలేకపోతున్నారు. ఎన్ని సార్లు వేలం వేసినా మిగిలిపోతున్నాయి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వీటిని ప్లాన్ చేసినప్పుడు శివారు ప్రాంతాల్లో ఉన్నాయి. బండ్లగూడ, పోచారం, మల్లంపేట్, బౌరంపేట్, బాచుపల్లి వంటి ప్రాంతాల్లో నిర్మించారు. ఇప్పుడు అవి సిటీలోకి కలిసిపోయాయి. కానీ. వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీనికి కారణం నిర్మాణంలో నాణ్యత లేకపోవడం.. మౌలిక సదుపాయాలను కల్పించరన్న గట్టి నమ్మకం ఏర్పడటమే.
రాజీవ్ స్వగృహ ప్రాజెక్టులలో నిర్మాణ నాణ్యత తక్కువగా ఉందన్న అభిప్రాయం ఉంది. అదే సమయంలో చాలా ఏళ్లుగా అలా వదిలేశారు. రాజీవ్ స్వగృహ ప్రాజెక్టులలో కొన్ని ఆలస్యంగా పూర్తయ్యాయి . నిర్మాణ సమస్యలను ఎదుర్కొన్నాయి, ఇది కొనుగోలుదారులలో నమ్మకాన్ని తగ్గించింది. రాజీవ్ స్వగృహ ప్రాజెక్టులు ప్రభుత్వ-స్పాన్సర్ చేసినవి కాబట్టి కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా నిర్మించారు. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల బాధ్యతల విషయంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం మానేశారు.
హైదరాబాద్లో రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు తక్కువ ధరలో అందుబాటులో ఉన్నప్పటికీ, శివారు స్థానాలు, పరిమిత కనెక్టివిటీ, ఆధునిక సౌకర్యాల కొరత వంటి కారణాల వల్ల కొనుగోలుదారులు ఇతర ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. అయితే, దీర్ఘకాలిక పెట్టుబడి దృక్పథంతో, ఈ ఫ్లాట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధితో లాభదాయకంగా మారవచ్చు. కానీ అవి నివాసానికి అనుకూలంగా ఉంటనే. వాటిని ఆ దిశగా అభివృద్ధి చేయాల్సిన అవసరం .. అధికారులపై ఉంది.