రాక్ష‌సుడు ట్రైల‌ర్‌: ట్విస్టులతో… ఇంట్రెస్టింగ్‌గా!

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ అన్నీ ట్రై చేస్తున్నాడు. ల‌వ్ స్టోరీలు చేశాడు. మాస్ క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌లు ఎంచుకున్నాడు. చంటి లాంటి పాత్ర‌లూ చేశాడు. చివ‌రికి ఇప్పుడు క్రైమ్‌, ఇన్వెస్టిగేష‌న్ క‌థ‌ని ఎంచుకున్నాడు. అదే `రాక్ష‌సుడు`. త‌మిళంలో సూప‌ర్ హిట్ట‌యిన `రాక్ష‌స‌న్‌`కి ఇది రీమేక్‌. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆగ‌స్టు 2న సినిమా విడుద‌ల అవుతోంది. ఇప్పుడు ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

ఇదో క్రైమ్ థ్రిల్ల‌ర్‌. ఓ సీరియ‌ల్ కిల్ల‌ర్‌ని, సైకోని ప‌ట్టుకోవ‌డానికి యువ పోలీస్ ఆఫీస‌ర్ చేసే ప్ర‌య‌త్నం. అంతు చిక్క‌ని హంత‌కుడు, అత‌న్ని ప‌ట్టుకోవాల‌నుకునే పోలీస్ – ఇద్ద‌రి మ‌ధ్య ఎత్తులు, పై ఎత్తులూ – క్రైమ్ థ్రిల్ల‌ర్ కి ఎలాంటి అంశాలు కావాలో, అవ‌న్నీ ఈ ట్రైల‌ర్‌లో క‌నిపిస్తున్నాయి. సాయి శ్రీ‌నివాస్ కూడా చాలా క‌ష్ట‌ప‌డి, ఇంటెన్సిటీతో చేసిన పాత్ర‌లా అనిపిస్తోంది. హీరోయిజం, అన‌వ‌స‌ర‌మైన బిల్డ‌ప్పుల‌కూ చోటివ్వ‌కుండా. కేవ‌లం క‌థ‌ని క‌థ‌గా న‌డిపించ‌డానికి చిత్ర‌బృందం ప్ర‌య‌త్నించిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ట్రైల‌ర్ క‌ట్ చేసిన విధానం చూస్తుంటే.. మాతృక‌ని తూ.చ త‌ప్ప‌కుండా ఫాలో అయ్యార‌నిపిస్తోంది. కెమెరా వ‌ర్క్‌, ఆర్‌.ఆర్‌… ఈ చిత్రానికి బ‌లం. కాస్టింగ్ కూడా భారీగానే క‌నిపిస్తోంది. క్రైమ్ థ్రిల్ల‌ర్‌ని స‌రిగా తీయాలే గానీ, ఆద‌రించ‌డానికి ఓ వ‌ర్గం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. మ‌రి బెల్లంకొండ ప్ర‌య‌త్నం వాళ్ల వ‌ర‌కూ చేరుతుందో లేదో చూడాలి.

https://www.youtube.com/watch?v=zhwMSTRl_nw&feature=youtu.be

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.