మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు ఎందుకంత హ‌డావుడ‌ని కోర్టు ప్ర‌శ్న‌..?

ఓ ప‌క్క కొత్త మున్సిప‌ల్ చ‌ట్టాన్ని తీసుకొచ్చే హడావుడిలో కేసీఆర్ స‌ర్కారు ఉన్న స‌మ‌యంలోనే, మ‌రోప‌క్క మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు సంబంధించి హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఎన్నిక‌ల‌ను ఎందుకంత హ‌డావుడిగా నిర్వ‌హించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారో చెప్పాల‌ని కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని కోర్టు ప్ర‌శ్నించింది. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు స‌మ‌యం ఉన్నా కూడా ఆద‌రాబాద‌రాగా ఎందుకు వెళ్లాల‌ని అనుకుంటున్నారంటూ అడిగింది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు సంబంధించిన దాఖ‌లైన పిల్ విచార‌ణ సంద‌ర్భంగా కోర్టు ఈ వ్యాఖ్య‌లు చేసింది.

ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేస్తుండ‌టం వ‌ల్ల అనేక ఇబ్బందులు వ‌స్తున్నాయ‌నీ, దీని వ‌ల్ల వార్డుల విభ‌జ‌న, ఓట‌ర్ల జాబితాలో త‌ప్పులు దొర్లుతున్నాయ‌న్నాయ‌నే అంశం త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది. ఇంత హ‌డావుడిగా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం వ‌ల్ల ఏదైనా ప్ర‌యోజ‌నం ఉందా అని సూటిగా కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. 109 రోజులు గ‌డువు ఉంటేనే ఎన్నిక‌ల‌కు వెళ్తామంటూ న్యాయ‌స్థానానికి గ‌తంలో టీ స‌ర్కారు కోరింద‌నీ, కానీ ఇప్పుడెందుకిలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని వ్యాఖ్యానించింది. మొత్తంగా ఓ 15 రోజుల్లోనే ఎన్నిక‌లు పూర్తి చేస్తామ‌నీ, అభ్యంత‌రాల నివృత్తికి కూడా ఒక్క‌రోజే గ‌డువు ఇస్తున్నార‌నీ, ఈ తొంద‌ర వ‌ల్ల కొన్ని చోట్ల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ సాధ్య‌మ‌య్యే ప‌రిస్థితి కూడా ఉండ‌దనే అంశాల‌ను గుర్తుచేసింది. ఈ సంద‌ర్బంగా తెలంగాణ సర్కారుతోపాటు, ఎన్నిక‌ల సంఘానికి కూడా నోటీసులు జారీ అయ్యాయి. విచార‌ణ‌ను సోమ‌వారానికి కోర్టు వాయిదా వేసింది.

కోర్టు చేసిన తాజా వ్యాఖ్య‌ల‌పై కౌంట‌ర్ దాఖ‌లు చేస్తామంటోంది టి.స‌ర్కారు. అయితే, ప్ర‌స్తుతం వ్య‌క్త‌మౌతున్న అభ్యంతరా‌ల‌న్నీ ప‌రిష్క‌రించాక‌నే ఎన్నిక‌ల‌కు వెళ్లాలంటూ జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు తాము సూచించామ‌ని ఎన్నిక‌ల సంఘం అంటోంది. ప్ర‌భుత్వంతోపాటు, ఎన్నిక‌ల సంఘం కూడా కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌నుంది. ఈ కౌంట‌ర్ల దాఖ‌లు త‌రువాత కోర్టు ఎలాంటి కీల‌క తీర్పుని ఇవ్వ‌నుంది అనేది కొంత ఆస‌క్తిక‌రంగా మారింది. మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ను త్వ‌ర‌గా నిర్వ‌హించేద్దాం అనే ఆలోచ‌న‌పై ఇప్ప‌టికే కేసీఆర్ స‌ర్కారు మీద భాజ‌పా, కాంగ్రెస్ నేత‌ల తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తాజాగా కోర్టు చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఆ విమ‌ర్శ‌ల డోస్ మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close