అనుష్క ప్రేమలో కథానాయిక

స్వీటీ అనుష్కని ప్రేమిస్తున్నానంటూ టాలీవుడ్ కథానాయిక ట్విట్టర్లో తన సందేశాన్ని పెట్టడం ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చకు దారితీసింది. సినిమాల్లో కథానాయకుడు సినిమాలో పాత్ర ప్రాధాన్యతను బట్టి తమ శరీరాన్ని మార్చుకుంటాడు సాధారణంగా ఇలాంటి సాహసాలు చేయాలంటే కథానాయికలు అసలు ముందుకు రారు. కాని అనుష్క మాత్రం అలాంటి పాత్రలే చేస్తూ అందరు అవాక్కయేలా చేస్తుంది.

అరుంధతి నుండి మొదలైన అనుష్క కథానాయికా ప్రాధాన్యత చిత్రాల హవా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మొన్నటిదాకా రుద్రమదేవి అంటూ సాహాసాలు చేసిన స్వీటీ ముద్దుగా బొద్దుగా తయారయ్యి సైజ్ జీరోలో దర్శన మిచ్చింది. సినిమాలో పాత్రం ప్రాధాన్యత దృష్ట్యా లావుగా కనిపించాలని సహజత్వం కోసం నిజంగానే లావెక్కిన అనుష్క సినిమా కోసం ఎంతటి కష్టమైనా పడుతుందని మరోసారి ఋజువుచేసింది.

అయితే ఆమెలోని ఈ గొప్పతన్నాన్ని చూసే సాటి కథానాయికలు ఆమెను ప్రేమిస్తున్నామంటూ ఆమెకు ప్రేమ సందేశాలు పంపిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా అభిమాన నీరాజనాలు అందుకుంటున్న రకుల్ అనుష్క ని ప్రేమిస్తున్నానంటూ ట్వీట్ చేయడం విశేషం. సైజ్ జీరో సినిమాలో అనుష్క నటన చూసి మంత్ర ముగ్ధురాలైన రకుల్ ‘ఐ యామ్ ఇన్ లవ్ విత్ స్వీటీ అనుష్క’ అంటూ ట్వీట్ చేసి అందరిని ఆకట్టుకుంది. అనుష్క పడ్డ కష్టానికి ఈ మాత్రం మెప్పు పొందకపోతే ఎలా చెప్పండి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]