అయినా… ఫ్యాన్సు మార‌లేదు!

ఎన్టీఆర్ – రామ్ చ‌ర‌ణ్ క‌లిసి ఓ సినిమా చేయ‌డం క‌చ్చితంగా టాలీవుడ్‌లో కొత్త సంప్ర‌దాయానికి నాంది ప‌లికే విష‌య‌మే. ఈ సినిమా వ‌ల్లైనా.. హీరోలు ఎంత క్లోజ్ గా ఉంటారో అర్థ‌మైంది. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల మ‌ధ్య ఉన్న బాండింగ్ అభిమానుల‌కు తెలిసొచ్చింది. ఎన్టీఆర్ తో దోస్తీ త‌న అదృష్ట‌మ‌ని చ‌ర‌ణ్ అంటే, చ‌ర‌ణ్ లాంటి వ్య‌క్తిని ఇదివ‌ర‌కెప్పుడూ చూడ‌లేద‌ని ఎన్టీఆర్ కితాబిచ్చాడు. ఈ సినిమా చేయ‌క‌ముందు నుంచీ తామిద్ద‌రూ మంచి ఫ్రెండ్స‌ని వీరిద్ద‌రూ చాలాసార్లు చెప్పారు. ఓ ర‌కంగా చెప్పాలంటే ఫ్యాన్స్ ని క‌లిపే సినిమా ఇది. కానీ అది జ‌రిగిందా..?

ఈరోజు ప్ర‌పంచ వ్యాప్తంగా `ఆర్‌.ఆర్‌.ఆర్‌` విడుద‌లైంది. ఎక్క‌డ చూసినా.. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` హ‌డావుడే. థియేట‌ర్లు తిరునాళ్ల‌లా మారిపోయాయి. అభిమానం కూడా.. గేట్లు దాటేసింది. ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌.. ఇద్ద‌రికీ ఎవ‌రి ఫ్యాన్స్ బేస్ వాళ్ల‌కుంది. ఆ అభిమానులు ఇప్పుడు పై చేయి కోసం ఆరాట‌ప‌డుతున్నారు. హైద‌రాబాద్ లో ఈరోజు ఉద‌యం మూడున్న‌ర‌కు ఆర్‌.ఆర్.ఆర్ ప్రీమియ‌ర్ జ‌రిగింది. ధియేట‌ర్ అంతా చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ అభిమానులుగా విడిపోయారు. `జై ఎన్టీఆర్‌` అని ఓ వ‌ర్గం.. `జై. జై చ‌ర‌ణ్‌` అంటూ వ‌ర్గం నినాదాల‌తో హోరెత్తించారు. రెండు ధియేట‌ర్లు కేవ‌లం చ‌ర‌ణ్ ఫ్యాన్స్ తో న‌డిచాయి. ఇంకో రెండు ధియేట‌ర్ల టికెట్లు మొత్తం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీసుకున్నారు. కూక‌ట్ ప‌ల్లి బ్ర‌మ‌రాంబ‌, మ‌ల్లిఖార్జున ధియేట‌ర్ల ద‌గ్గ‌రైతే చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ల హంగామా నువ్వా నేనా అన్న‌ట్టు సాగింది. తూ.గో జిల్లాలోని కొన్ని ధియేట‌ర్లలో ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ ఫ్యాన్స్ మ‌ధ్య ఘర్ష‌ణ కూడా చోటు చేసుకుంద‌ని స‌మాచారం. `మా హీరో ఎక్కువ అంటే… మా హీరో ఎక్కువ‌` అని ఓవ‌ర్గం… `మా హీరో క‌టౌట్ పెద్ద‌దంటే…. మా హీరో క‌టౌట్ పెద్ద‌ది` అని మ‌రోవ‌ర్గం.. ఇలా ఎవ‌రికి తోచిన దారిలో వాళ్లు త‌మ ఆధిప‌త్య ప్ర‌ద‌ర్శ‌న చేసే కార్య‌క్ర‌మంలో ప‌డిపోయారు. ఇద్ద‌రు హీరోలు స్నేహితులుగా మారి, సినిమా చేస్తే… అభిమానులూ ఆ గౌర‌వాన్ని, స్నేహాన్ని ఇచ్చి పుచ్చుకోవాలి. అప్పుడే అందం. ఆనందం. ఈ విష‌యాన్ని కొంత‌మంది దురాభిమానులు మ‌ర్చిపోవ‌డం శోచ‌నీయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాలుగైదు సినిమాలకు అడ్వాన్సులు – గెలిచినా పవన్ బిజీనే !

పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత కూడా తీరిక లేకుండా ఉంటారు. అయితే రాజకీయాలతో కాదు. సినిమాలతో. పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు,...

మేనిఫెస్టో మోసాలు : చేసింది జలయజ్ఞం కాదు జలభగ్నం !

వైఎస్ఆర్ జలయజ్ఞం.. వైఎస్ఆర్ కలలు కన్నారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం .. జలకళను...

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close