సిద్దా వ‌చ్చాడు ఆచార్యా…!

చిరంజీవి – రామ్ చ‌ర‌ణ్‌… ఇద్ద‌రినీ ఒకేసారి, వెండి తెర‌పై చూస్తే ఆ ఆనంద‌మే వేరు. మ‌గ‌ధీర‌లో ఓ స‌న్నివేశంలో చ‌టుక్కున మెరిశాడు చిరు. ఖైదీ నెం 150లో… చ‌ర‌ణ్ కూడా చిరుతో స్టెప్పులు వేశాడు. కానీ ఇద్ద‌రూ పూర్తి స్థాయి పాత్ర‌ల్లో క‌నిపించ‌లేదు. `ఆచార్య‌`తో ఆ క‌ల నెర‌వేరుతోంది. చిరు న‌టిస్తున్న ఆచార్య‌లో చ‌ర‌ణ్ ఓ కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.

చ‌రణ్ `ఆర్‌.ఆర్‌.ఆర్` తో బిజీగా ఉన్న నేప‌థ్యంలో.. త‌ను ఎప్పుడు ఆచార్య షూటింగ్ లో పాల్గొంటాడా? అని అభిమానులంతా ఆస‌క్తిగా ఎదురు చూశారు. ఇప్పుడు ఆ త‌రుణం వ‌చ్చేసింది. ఈరోజు నుంచి చ‌ర‌ణ్ సెట్లో అడుగుపెట్టేశాడు. ఈ సినిమాలో సిద్దాగా క‌నిపించ‌బోతున్నాడు చ‌ర‌ణ్‌. త‌న ప్రీ లుక్ ని సైతం.. చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. చెవి పోగు, మెడ‌లో రుద్రాక్ష‌ల‌తో క‌నిపిస్తున్నాడు.. సిద్దా. ఈ సినిమాలో చిరు – చ‌ర‌ణ్‌లు గురు శిష్యులుగా క‌నిపించ‌బోతున్నార్ట‌. ఇద్ద‌రి మ‌ధ్యా సాగే స‌న్నివేశాలే.. క‌థ‌కి ప్రాణం అని తెలుస్తోంది. చ‌ర‌ణ్ ప‌క్క‌న కూడా ఓ క‌థానాయిక ఉండ‌బోతోంది. ఆమె ఎవ‌ర‌న్న‌ది ఇంకా తేల‌లేదు. ఈ వేస‌వికి ఆచార్య ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉమెన్స్ డే రోజూ అమరావతి మహిళా రైతులకు దెబ్బలే..!

మహిళా దినోత్సవం రోజునా అమరావతి మహిళా రైతులకు ఎలాంటి గౌరవం లభించలేదు సరి కదా.. పోలీసులు చేతిలో దెబ్బలు తినాల్సి వచ్చింది. ఓ వైపు మహిళలకు అండగా నిలబడతామని పెద్ద పెద్ద ప్రకటనలు...

తొలి 10 నిమిషాలు ముందే చూపించేస్తార్ట‌!

మంచు విష్ణు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం మోస‌గాళ్లు. ఇదో వైట్ కాల‌ర్ మోసం చుట్టూ తిరిగే క‌థ‌. టెక్నాల‌జీని వాడుకుంటూ... మోస‌గాళ్లు ఎలా రెచ్చిపోతున్నారో చెప్పే క‌థ‌. ట్రైల‌ర్ ఇటీవ‌లే విడుద‌లైంది. కాజ‌ల్,...

బాల‌య్య రైట్ హ్యాండ్‌.. జ‌గ్గూ భాయ్‌

లెజెండ్‌తో.. జ‌గ‌ప‌తిబాబులోని విల‌న్ విశ్వరూపం చూపించాడు. ఆ సినిమాతో జ‌గ‌పతి బాబు కెరీర్ ట‌ర్న్ అయిపోయింది. హీరోగా ఎంత సంపాదించాడో తెలీదు గానీ, విల‌న్ గా మారాక మాత్రం జ‌గ‌ప‌తి ఆస్తులు పెరిగాయి....
video

మ‌హిళా శ‌క్తి @ విరాట ప‌ర్వం

https://www.youtube.com/watch?v=dQ9S_uy-5sM విరాట‌ప‌ర్వం... ఈ సినిమా పేరు చెప్ప‌గానే ఓ ప్రేమ‌క‌థో, ఓ విప్ల‌వ గాథో, ఓ అభ్యుద‌య చిత్ర‌మో, ఓ సామాజిక స్పృహ ఉన్న ప్ర‌య‌త్న‌మో... అనిపిస్తోంది. పోస్ట‌ర్లూ అలానే ఉన్నాయి. అయితే.....

HOT NEWS

[X] Close
[X] Close