కోహ్లీ బ‌యోపిక్‌లో చ‌ర‌ణ్‌

రామ్ చ‌ర‌ణ్ మ‌న‌సు ఇప్పుడు బ‌యోపిక్‌పై ప‌డింది. త‌న‌కు బ‌యోపిక్‌లో న‌టించాల‌ని ఉంద‌ని, అవ‌కాశం వ‌స్తే… కోహ్లీ బ‌యోపిక్ చేస్తానంటూ ప్ర‌క‌టించేశాడు రామ్ చ‌ర‌ణ్‌. ఆస్కార్ పుర‌స్కారాల వేడుక ముగించుకొన్న చర‌ణ్ శుక్ర‌వారం స్వ‌దేశం చేరుకొన్నాడు. శుక్ర‌వారం అంతా ఢిల్లీలోనే బిజీ బిజీగా గ‌డిపాడు. అక్క‌డ జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో చ‌ర‌ణ్ త‌న మ‌న‌సులోని మాట బ‌య‌ట పెట్టాడు. కోహ్లీ బ‌యోపిక్‌లో న‌టించాల‌ని ఉందంటూ.. ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పుకొచ్చాడు చ‌రణ్‌.

ఆర్‌.ఆర్‌.ఆర్ త‌ర‌వాత‌.. చ‌రణ్ గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది. త‌ను ఇప్పుడు గ్లోబ‌ల్ స్టార్‌గా మారాడు. బాలీవుడ్ నుంచి చ‌ర‌ణ్‌కి ఇప్పుడు మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. అందులో భాగంగానే.. కోహ్లీ బ‌యోపిక్ ఆఫ‌ర్ ఏమైనా చ‌ర‌ణ్ ముందుకొచ్చిందా? అందుకే ఇప్పుడు ఇలా… మ‌న‌సు విప్పాడా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. కోహ్లీ బ‌యోపిక్ చేయాల‌ని బాలీవుడ్ లో ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. దీనికి కోహ్లీ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు.కానీ… ఆ ప్రాజెక్ట్ ఇంకా పైప్ లైన్‌లోనే ఉంది. ఇప్పుడు చ‌ర‌ణ్‌… త‌న మ‌న‌సులోని మాట బ‌య‌ట‌పెట్టాడు కాబ‌ట్టి.. బాలీవుడ్ రూప‌క‌ర్త‌లు ఈ దిశ‌గా దృష్టి సారించే అవ‌కాశం ఉంది. కోహ్లీగా చ‌ర‌ణ్ బాగుంటాడంటూ, పోలిక‌లు కూడా ఉన్నాయంటూ.. అప్పుడే అభిమానులు ఈ బ‌యోపిక్ పై పాజిటీవ్ గా స్పందిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close