పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కూడా టీడీపీదే !

వైసీపీకి పెట్టని కోట లాంటి కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో పట్టభద్రులు కూడా ఆ పార్టీని బై బై చెప్పేశారు. గత ఎన్నికల్లో అక్కడ్నుంచి వైసీపీ భారీ మెజార్టీతో గెలిచింది. కానీ ఈ సారి అధికారంలో ఉండి కూడా ఘోర పరాజయాన్ని పాలైంది. ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తర్వాత టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విజయం సాధించారు. దీంతో తెలుగుదేశం పార్టీ అభిమానులు పులివెందులలో కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.

భూమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజవర్గం పులివెందులనే. మొదటి నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటుపై గురి పెట్టి శ్రమించారు. కడపలో ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో బ్యాలెట్ రిగ్గింగ్ ఉంటుంది. అయినా తీవ్ర స్థాయిలో పోరాడారు. చివరికి పులివెందులలో కూడా భూమిరెడ్డికి మెజార్టీ వచ్చింది. ఇప్పటికే టీడీపీ తపున బీటెక్ రవి పులివెందుల నుంచి స్థానిక సంస్థ కోటాల కింద ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ నియోజకవర్గం నుంచి టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నట్లయింది.

పశ్చిమ సీమలోనూ వైసీపీ ఓడిపోవడం ఆ పార్టీకి నైతికంగా పెద్ద దెబ్బ, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కలిపి టీడీపీకి గత ఎన్నికల్లో రెండు అంటే రెండు అసెంబ్లీ సీట్లు వచ్చాయి. కడప, కర్నూలులో ఒక్కటీ రాలేదు. నాలుగేళ్లలోనే పరిస్థిత మారిపోవడం వైసీపీ వర్గాలకూ ఇబ్బందికరంగా మారింది.

బీజేపీ ఓటర్ల రెండో ప్రాధాన్యత కూడా టీడీపీనే!

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిబంధనల ప్రకారం ఎవరికీ తొలి ఓటింగ్‌లోనే యాభై శాతం రాలేదు. కానీ ద్వితీయ ప్రాధాన్య ఓట్లతో గెలిచారు. ఈ ద్వితీయ ప్రాధాన్య ఓట్లలో కూడా టీడీపీ అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్ రౌండ్‌లో ఆ పార్టీకి ఓటు వేసిన ఓటర్లు ద్వితీయ ప్రాధాన్యంగా తెలుగుదేశం అభ్యర్థులకే మద్దతిచ్చారు. ఇది రాజకీయవర్గాలను కూడా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే బీజేపీ సంప్రదాయ ఓటర్లు టీడీపీకి మద్దతివ్వరన్న ఓ ప్రచారం ఉంది. కానీ అది నిజం కాదని ఈ ఎన్నికల ద్వారా తేలినట్లయింది.

సోషల్ మీడియాలోనూ కొంత మంది బీజేపీ నేతలు .. ఆ పార్టీ కార్యకర్తలు చాలా తీవ్రంగా టీడీపీని విమర్శిస్తూ ఉంటారు. వైసీపీకి మద్దతుగా ఉంటూ ఉంటారు. తము వైసీపీకైనా ఓటు వేస్తాం కానీ టీడీపీకి కాదన్నట్లుగా వాదిస్తూ ఉంటారు. ఇలాంటి అభిప్రాయాలు ఉన్న వాళ్లు బీజేపీలో పరిమితంగా ఉంటారని స్పష్టమయింది.

మూడు ఎమ్మెల్సీల్లో ముఖ్యంగా.. రాయలసీమలో టీడీపీ విజయాల వెనుక ఉన్నది ద్వితీయ ప్రాధాన్య ఓట్లే. బీజేపీ కార్యకర్తలు కూడా ఆ పార్టీ తర్వాత టీడీపీనే అనుకున్నారు కానీ.. బీజేపీ అనుకోలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌తంజ‌లిని మ‌ళ్లీ నిల‌దీసిన సుప్రీం… ఈసారి ఇంకా ఘాటుగా!

ప‌తంజ‌లి క్ష‌మాప‌ణ‌ల‌కు స‌సేమిరా అంటున్న సుప్రీంకోర్టు... ప‌తంజ‌లి ప్ర‌మోట‌ర్ల‌పై మ‌రోసారి మండిప‌డింది. కావాల‌నే తెలివిగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సాగుతున్న విచార‌ణ‌లో భాగంగా...

సూర‌త్ ఎన్నిక వెనుక జ‌రిగింది ఇదేనా?- బీజేపీలోకి కాంగ్రెస్ అభ్య‌ర్థి

క‌మ‌ల వికాసం మొద‌లైపోయింది. సూర‌త్ లో బీజేపీ అభ్య‌ర్థి గెలుపుతో మొద‌లైన ఈ హ‌వా 400సీట్ల‌కు చేర‌కుంటుంద‌ని బీజేపీ సంబురాలు చేసుకుంటుంది. అనైతిక విజ‌యం అంటూ కాంగ్రెస్ విరుచుక‌ప‌డుతుంటే, నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణకు గురైన...

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close