త‌మిళ సినిమాపై రామ్ చ‌ర‌ణ్ క‌న్ను

ధృవ సినిమాని రీమేక్ చేసి ఓ హిట్టు కొట్టాడు రామ్ చ‌ర‌ణ్‌. అప్ప‌టి నుంచీ త‌మిళ సినిమాల‌వైపు చ‌ర‌ణ్ దృష్టి సారిస్తూనే ఉన్నాడు. తాజాగా `హీరో`పై చ‌ర‌ణ్ క‌న్ను ప‌డింది. శివ‌కార్తికేయ‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రం ఇటీవ‌లే విడుద‌లై మంచి టాక్ తెచ్చుకుంది. విడుద‌ల‌కు ముందే ఈ సినిమా గురించి తెలుసుకున్న చ‌ర‌ణ్‌.. రీమేక్‌, డ‌బ్బింగ్ రైట్స్‌ని హోల్డ్ చేశాడ‌ట‌. ఈ సినిమాని చ‌ర‌ణ్ రీమేక్ చేయొచ్చు, లేదంటే డబ్ చేసి వ‌ద‌లొచ్చు. రెండింటిలో ఏదైనా జ‌ర‌గొచ్చు. రీమేక్ చేస్తే ఓ రేటు, కేవ‌లం డ‌బ్బింగ్‌కే ప‌రిమిత‌మైతేఉ మ‌రో రేటు ఇస్తాన‌ని నిర్మాత‌ల‌కు చ‌ర‌ణ్ మాటిచ్చాడ‌ట‌.

సూప‌ర్ హీరో కావాల‌నుకునే ఓ క‌థానాయ‌కుడి క‌థ ఇది. శ‌క్తిమాన్‌ని చూసి, సూప‌ర్ హీరోలా విన్యాసాలు చేయాల‌నుకుంటాడు హీరో. మ‌రి త‌న కోరిక ఎలా నెర‌వేరింద‌న్న ఆస‌క్తిక‌ర‌మైన పాయింట్‌తో ఈ సినిమాని తెర‌కెక్కించారు. నిజానికి తెలుగులోనూ ఈసినిమాని డ‌బ్ చేసి విడుద‌ల చేద్దామ‌నుకున్నారు. రీమేక్ చేయ‌డానికి చ‌ర‌ణ్ ఆస‌క్తి చూపించ‌డంతో డ‌బ్బింగ్ ప‌నులు ఆపేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close