ఐటెమ్ సాంగ్ తీయడంలో సుకుమార్ ది సెపరేట్ స్టైల్. వాటికంటూ సెపరేట్ స్టైల్ ఉంది. ఆయన సినిమాల్లోని ఐటెమ్ గీతాలన్నీ హిట్టే. ఆయన శిష్యుడు బుచ్చిబాబు కూడా ఐటెమ్ పాటల్లో తన మార్క్ చూపించాలనుకొంటున్నాడు. తొలి సినిమా `ఉప్పెన`లో ఐటెమ్ పాటకు స్కోప్ దొరకలేదు. కానీ ‘పెద్ది’లో ఆ ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా కోసం రెహమాన్ ఓ మంచి ఐటెమ్ పాట సిద్ధం చేశారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలూ సూపర్ హిట్టయ్యాయి. ఐటెమ్ గీతంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. తప్పకుండా రెహమాన్ నెక్ట్స్ లెవల్ పాటే సిద్ధం చేసి ఉంటాడు.
కాకపోతే ‘పెద్ది’ సినిమాలోని ఐటెమ్ పాటలో కనిపించేది ఎవరన్నదే ప్రశ్న. ఈ సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా ‘ఎస్’ చెప్పేస్తుంది. సమంత, పూజా హెగ్డే, మృణాల్ ఇలా చాలా పేర్లే పరిశీలనలో ఉన్నాయి. అయితే.. డేట్లు ఎడ్జస్ట్ అవ్వాలి. ఎందుకంటే ఏప్రిల్ 30న పెద్ది రిలీజ్ చేయాలన్న పట్టుదలతో ఉంది టీమ్. అలా జరగాలంటే ఏప్రిల్ 10 నాటికైనా షూటింగ్ అవ్వాలి. అంటే మరో 20 రోజుల సమయం ఉంది. ఇంత షార్ట్ గ్యాప్ లో ఏ కథానాయిక అందుబాటులో ఉంటుందదో చూడాలి. చేతిలో టైమ్ ఉంటే, ఏరి కోరి ఎంచుకొనే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు అదే లేదు. కాబట్టి… దొరికిన వాళ్లతో ఎడ్జస్ట్ అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉన్నంతలో కాస్త క్రేజ్ ఉన్న హీరోయిన్ ని రంగంలోకి దింపాలని టీమ్ భావిస్తోంది. ఇప్పటి వరకూ చరణ్ తో జోడీ కట్టని హీరోయిన్ అయితే బెటర్ అనే మాట వినిపిస్తోంది. ఆ లెక్కన చూస్తే మృణాల్ కి ఎక్కువ ఛాన్స్ వుంది. చివరికి ఏ హీరోయిన్ ని ఎంపిక చేస్తారో చూడాలి.