రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మైసూర్లో రామ్ చరణ్ మీద ఓ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు దర్శకుడు బుచ్చిబాబు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ లో వెయ్యి మందికి పైగా డ్యాన్సర్లతో ఈ పాటని షూట్ చేస్తున్నారు. ఇప్పుడు స్వయంగా రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ‘మాస్ట్రో రెహ్మాన్ మాయాజాలంతో పెద్దిని ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఆవిష్కరించారు. మా ఫస్ట్ సింగిల్ త్వరలోనే రాబోతోంది’అని ట్వీట్ చేశారు చరణ్.
చాలా రోజుల తర్వాత రెహ్మాన్ తెలుగులో చేస్తున్న సినిమా ఇది. ఇప్పటికే పెద్ది గ్లింప్స్ కి రెహ్మాన్ ఇచ్చిన బీజీఎం జనాల్లోకి వెళ్ళింది. పెద్ది ఆల్బమ్ పై అంచనాలు పెంచింది. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పెద్ది మార్చి 27, 2026న రిలీజ్ కి రెడీ అవుతుంది. త్వరలో పాటని రిలీజ్ చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ ని కూడా కిక్ స్టార్ట్ చేయబోతున్నారు మేకర్స్.