నటి శ్రీదేవిపై రాం గోపాల్ వర్మ అభ్యంతరకర వ్యాఖ్యలు

దర్శకుడు రాంగోపాల్ వర్మ మళ్ళీ మరో వివాదస్పదమయిన సినిమా పేరు, నటి శ్రీదేవి గురించి చాలా అభ్యంతరకరమయిన మెసేజ్ లు పోస్ట్ చేసారు. తన తరువాత సినిమా పేరు “ఆంధ్రా సిఎం కిడ్నాప్..దానికి ట్యాగ్ లైన్ తెలంగాణా సిఎం సస్పెక్టడ్” అని ప్రకటించారు. వివదస్పదమయిన ఈ పేరుపై మీడియాలో చర్చలు, రాజకీయ నేతల నిరసనలు జరిగే అవకాశం ఉంటుంది కనుక సినిమా షూటింగ్ మొదలుపెట్టక మునుపే దానికి ఫ్రీగా పబ్లిసిటీ వస్తుంది.

ఇక ఒకనాటి మేటి నటి శ్రీదేవి గురించి కూడా రాంగోపాల్ వర్మ తన ట్వీటర్ లో చాలా అభ్యంతరకరమయిన మెసేజ్ లు పోస్ట్ చేసారు.

“నేను శ్రీదేవిజీ వీరాభిమానిని. ఆమె భర్త బోనీ కపూర్ ఆమెను ఎంతగా గౌరవిస్తున్నారో అంతకంటే ఎక్కువే నేను ఆమెను గౌరవిస్తున్నాను. ఆ సంగతి ఆమెకు కూడా తెలుసు. కనుక నా ఈ మెసేజులు చూసి నాపై విరుచుకు పడకుండా, నేను శ్రీదేవిజీ తొడల గురించి నా “గన్స్ అండ్ థైస్” అనే పుస్తకంలో వ్రాసినదంతా చదవాలని బోనీ కపూర్ ని కోరుతున్నాను. శ్రీదేవిజీకి సినిమాలలో ఇంత కీర్తి ప్రతిష్టలు వచ్చేయంటే దానికి కారణం ఆమె అద్భుతమయిన నటన ఒకటే కాదు. అద్భుతమయిన ఆమె తొడలు కూడా ఒక కారణమేనని ఆమె నటించిన హిమ్మత్ వాలా సినిమాని చూసి విమర్శకులు అభిప్రాయ పడ్డారు. ఒకవేళ కేవలం ఆమె అద్భుతమయిన నటనను మాత్రమే ఆమె ఎదుగుదలకు కొలమానంగా భావించినట్లయితే, ఆమె వలే అద్భుతంగా నటించే స్మితా పాటిల్ కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి ఉండాలి. కానీ శ్రీదేవిజీ తొడలే (తండరింగ్ థైస్) ఆమెను స్మితా పాటిల్ కంటే గొప్ప స్థానంలో నిలిపాయని భావిస్తున్నాను. నేను శ్రీదేవిగారి తొడలను, ఆమె చిరునవ్వును, ఆమె అద్భుతమయిన నటనను, సున్నితంగా స్పందించే ఆమె గుణాన్ని, ఆమె వ్యక్తిత్వాన్ని చాలా గౌరవిస్తున్నాను. అన్నిటికంటే ఎక్కువగా ఆమె తన భర్త బోణీ కపూర్ పట్ల చూపుతున్న ప్రేమను గౌరవిస్తున్నాను,” అని వర్మ తన తాజా ట్వీటర్ మెసేజు లో వ్రాసారు. వర్మ గురించి, వర్మ వ్రాసిన ఈ విషయాల గురించి ఎవరు ఏవిధంగా స్పందిస్తారో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close